ఆదిలాబాద్‌టౌన్: ఎస్టీయూ 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వైభవోత్సవ జ్ఞాపికను మాజీమంత్రి జోగు రామన్నకు ఎస్టీయూ జిల్లా నాయకులు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎస్టీయూ కృషి చేస్తుందన్నారు. వీపీ రాఘవాచారి, కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ వంటి గొప్ప నాయకులను అందించిన ఘనత ఎస్టీయూకు ఉందన్నారు. సంఘంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ, విద్యారంగ సంక్షేమానికి ఎస్టీయూ మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. 80 వసంతాల వైభవోత్సవం సందర్భంగా సంఘం సభ్యులు, కార్యకర్తలు, జిల్లా, రాష్ట్ర నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.


