పాముకాటుతో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో యువకుడు మృతి

Oct 13 2026 12:05 AM | Updated on Oct 13 2026 12:05 AM

సారంగపూర్‌: మండలంలోని దేవితండాకు చెందిన రాథోడ్‌ గంగారాం(21) అనే యువకుడు సోమవారం వ్యవసాయ పనులు చేస్తుండగా పాముకాటు వేయడంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగారాం తండ్రి సీతారాంతో కలిసి తమ పంటపొలంలో సోయా చిక్కుడు పంట కోస్తున్న క్రమంలో పాము కాటువేసింది. గమనించిన యువకుడు పెద్దగా కేకలు వేసి పాముకాటు వేసినట్లు తెలపడంతో అప్రమత్తమైన వ్యవసాయ పనులు చేసే కూలీలు వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సీతారాం –సేతుబాయికి ముగ్గురు మగసంతానం కాగా గంగారం వారి రెండో కుమారుడు. ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement