సారంగపూర్: ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీఅడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల మహాజాతర ఈనెల 17, 18వ తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను దేవాదాయ శాఖ అధికారులతో పాటు స్థానిక నాయకులు సోమవారం పరిశీలించారు. కౌట్ల(బి) పీఏ సీఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డితో పా టు వివిధ పార్టీల నాయకులు ఆలయానికి వ చ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఇతర సౌకర్యాలతో పాటు వాహనాల పార్కింగ్ స్థలం, వాహనాలు దారిమళ్లించే ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఆలయ ఈవో భూమయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.


