ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆస్పత్రికి నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు పదోన్నతిపై వచ్చారు. సోమవారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌కు రిపోర్టు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వీరికి వైద్య శాఖ పదోన్నతి కల్పించింది. జనరల్ మెడిసిన్ విభాగంలో నిజామాబాద్, నిర్మల్‌లో పనిచేస్తున్న సందీప్ పవార్లకు పదోన్నతి లభించింది. నిర్మల్ నుంచి వచ్చిన గైనిక్ విభాగంలో పి.క్రాంతి, ఆర్థోపెడిక్ విభాగంలో నిజామాబాద్ నుంచి మోహన్‌రెడ్డి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న సైకియాట్రిస్ట్ రాజశేఖర్‌రెడ్డి పదోన్నతిపై నిజామాబాద్‌కు వెళ్లారు.


