నెల్లూరు(టౌన్): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత, ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లను ఘనంగా సన్మానించారు. డీవీ సుబ్బరాజు, స్వర్ణ రమేష్‌బాబు, హబీబ్‌ఖాన్, చంద్రమౌళి, కొండారెడ్డిలను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎంకె రెడ్డి, కార్యదర్శి ప్రసాద్, గౌరవాధ్యక్షుడు మేకల నరేంద్రరెడ్డి, కోశాధికారి ఖలీల్‌బేగ్, రాఘవరెడ్డి, సునీల్‌కుమార్‌రెడ్డి, పొన్నం రవిచంద్ర, విజయమోహన్‌నాయుడు, సుబ్బరామిరెడ్డి, హరిరావు, శేషగిరిరావు, గఫర్, మస్తానయ్య, ప్రభాకర్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
● నెల్లూరు(బృందావనం): ట్రంకురోడ్డు ఛత్రపతి శివాజీసెంటర్‌లో ఉన్న టీవీఎస్ కల్యాణ సదన్‌లో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అధ్యాపకుడు, సీనియర్ రంగస్థల నటుడు వల్లకవి వెంకటసుబ్బారావుతోపాటు మరో 15 మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల, కళాశాలల టీచర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆ సమితి అధ్యక్షుడు గుడ్లదొన వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శి దుద్దుకూరు రమేష్, కార్యనిర్వాహక కార్యదర్శి మద్దులపల్లి శ్రీధర్, యువజన సంఘం అధ్యక్షుడు విష్ణుతేజ, మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయలక్ష్మి, నాగలక్ష్మి, జ్యోతి, ఛాయాదేవి, విజయలక్ష్మి, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.


