విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపే లక్ష్యం

Aug 20 2026 2:52 AM | Updated on Aug 20 2026 2:52 AM

ఆదిలాబాద్‌(బేల): ప్రతీ విద్యార్థి కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈవో డి. మాధవి అన్నారు. బేల మండలంలోని సిర్సన్న ఉన్నత పాఠశాల, బేల ప్రాథమిక పాఠశాల, మశాలా బి ప్రాథమికోన్నత పాఠశాలలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో అమలవుతున్న తొలిమెట్టు (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమం తీరును పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలల్లోని బడితోట, మధ్యాహ్న భోజ నాన్ని పరిశీలించి, మండల విద్యా వనరుల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆమె వెంట ఎంఈవో మహాలక్ష్మి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement