కై లాస్‌నగర్: రాఖీ పండుగ నాకు ఎంతో స్పెషల్. మా అమ్మ, నాన్నలకు నేను ఏకై క సంతానం. నాకు తోబుట్టువులు లేరు. కానీ, మా పెద్దమ్మ, చిన్నమ్మ, పెదనాన్నల కూతుళ్లు అర్చన, నిఖిత, అంజమ్మ నాకు సొంత అక్కాచెల్లెళ్ల లెక్కనే. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు.. వారు ఎక్కడ ఉన్నా.. ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వచ్చి రాఖీ కడతారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా వారికి దూరంగా ఉన్నప్పటికీ మరిచిపోకుండా రాఖీ కట్టేందుకు వస్తారు. నాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపుతారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ రక్షబంధన్‌ను ఎంత గొప్పగా జరుపుకొంటామో.. అంత గొప్పగానే మహిళలపై గౌరవభావంతో మెలగాలి. ప్రతి ఒక్కరూ ఎదుటి మహిళ, యువతులను తమ సొంత ఆడబిడ్డలుగా భావించినప్పుడే వేధింపులు లేని ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యపడుతుంది. – మంద మకరందు, ఐటీడీఏ పీవో, ఉట్నూర్


