ఎస్సీ నిరుద్యోగులు కాంట్రాక్టర్లుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ నిరుద్యోగులు కాంట్రాక్టర్లుగా ఎదగాలి

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

● కలెక్టర్‌ రాజర్షిషా ● జెడ్పీ సమావేశ మందిరంలో అవగాహన

కైలాస్‌నగర్‌: ఎస్సీ నిరుద్యోగులు కాంట్రాక్టర్లుగా ఎ దిగి ఆర్థికంగా స్థిరపడాలని కలెక్టర్‌ రాజర్షిషా పిలు పునిచ్చారు. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వ్యక్తులు కాంట్రాక్టర్లుగా ఎదగడానికి అవసరమైన నియమ, ని బంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించగా ఆయన హాజరయ్యారు. పంచాయతీ రాజ్‌, మిషన్‌ భగీరథ, విద్యుత్‌, మున్సిపాలిటీ, నీటిపారుదల, రోడ్లు, భవనాల శాఖలకు చెందిన ఎస్‌ ఈలు పాల్గొని పలు అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరణ ఇచ్చారు. జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి సునీత, జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి మిల్కా, ఇంజినీరింగ్‌ శాఖలకు చెందిన అధికారులు పవన్‌కుమార్‌, రాజసింహం, రాజేశ్‌నాయక్‌, చంద్రమోహన్‌, సాగర్‌, కిరణ్‌, అక్షిత్‌కుమార్‌ తదితరులున్నారు.

తోషంలో గ్రంథాలయం..

గుడిహత్నూర్‌: మండలంలోని తోషం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్‌ రాజర్షిషా గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లెపూల నర్సయ్య, ఐటీడీఏ పీవో మంద మకరందుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన గ్రామసభలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు అందజేశారు. అనంతరం సద్గురు పూలాజీబాబా జన్మదిన మహోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. స్థానిక సర్పంచ్‌ పద్మ గ్రామ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించగా పరిష్కారానికి హామీ ఇచ్చారు. డీపీవో రమేశ్‌, డీఎల్పీవో ఫణిందర్‌, తహసీల్దార్‌ కవితారెడ్డి, ఎంపీడీవో ఇంతియాజ్‌, ఎంఈవో గోపాల్‌సింగ్‌, ఉపసర్పంచ్‌ షెహనాజ్‌, డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌ తదితరులున్నారు.

వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభం

నార్నూర్‌: మండలంలోని గుంజాల గ్రామంలో వాటర్‌షెడ్‌ ప్రాజెక్ట్‌ పనులను కలెక్టర్‌ రాజర్షిషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓట రు జాబితా సవరణపై గ్రామసభ, గ్రామాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. హస్నాపూర్‌–నా ర్నూర్‌ రహదారితోపాటు పెండింగ్‌లో రహదా రులకు త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు మండల పరి షత్‌ ప్రాథమిక పాఠశాలలోని న్యూట్రిగార్డెన్‌ను పరిశీలించి నిర్వహణ తీరును అభినందించారు. అనంతరం మొక్క నాటి నీరు పోయగా, గ్రామస్తులు ఆ మొక్కకు రాజర్షి షాగా నామకరణం చే శారు. నాబార్డ్‌ డీడీఎం అబ్దుల్‌ రౌఫ్‌, ధాన్‌ స్వ చ్ఛంద సంస్థ ప్రతినిధి నీలేశ్‌, పీఆర్‌ ఈఈ శివరాం, ఎంపీడీవో పుల్లారావు, తహసీల్దార్‌ రాజ లింగు, ఎంఈవో మనోహర్‌, డీఎల్పీవో ప్రభాకర్‌, సర్పంచ్‌ జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement