ఎన్నడూ మరువలేదు | - | Sakshi
Sakshi News home page

ఎన్నడూ మరువలేదు

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

ఖానాపూర్‌: దేశ సేవలో భాగంగా ఆర్మీలో 15 ఏళ్లకు పైగా విధులు నిర్వహించాను. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో విధుల కారణంగా రాఖీ పండుగకు అక్కాచెల్లెళ్ల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకునే అవకాశం ఉండేది కాదు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించడంతో రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వచ్చేది. అక్కాచెల్లెళ్ల నుంచి ఫోన్‌లో శుభాకాంక్షలు అందుకున్నా, వారి చేతుల మీదుగా రాఖీ కట్టించుకోలేకపోవడం బాధగా ఉండేది. ప్రస్తుతం ఆర్మీ నుంచి విరమణ పొందాను. రెండేళ్లుగా రాఖీ పండుగను అక్కాచెల్లెళ్లతో కలిసి జరుపుకొంటున్నాను. అక్కల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఉద్యోగ సమయంలో కోల్పోయిన ఆత్మీయ క్షణాలను ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నాను. దేశ సేవలో భాగంగా పండుగలు, కుటుంబ వేడుకలకు దూరంగా ఉండే సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి.

– కడుకుంట్ల ప్రవీణ్‌, ఖానాపూర్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: మా అన్నయ్య ఉద్యోగరీత్యా అండమాన్‌లో సీజీఎంగా విధులు నిర్వహించేవారు. విధి నిర్వహణలో వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు. ఇటీవలే ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. నేను కూడా నిర్మల్‌ జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కారణంగా ప్రతీ రక్షాబంధన్‌ రోజు కలుసుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. అయినప్పటికీ నేను రాఖీ పండుగకు రాఖీ పంపడం ఎన్నడూ మరువలేదు. ఈసారైనా అన్నయ్యకు నా చేతులతో రాఖీ కట్టాలని అనుకుంటున్న.

– విజయలక్ష్మి, నిర్మల్‌ డీఆర్డీవో

ఎదురుచూస్తుంటా..

చింతలమానెపల్లి: ఇంటికి దూరంగా దేశసేవ కోసం సరిహద్దుల్లో ఉండే మా సైనికులకు రాఖీ పండుగ ఎంతో ప్రత్యేకం. పోస్ట్‌లో స్వగ్రామం నుంచి పంపించే రాఖీ కట్టుకుంటే మాకు కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రతీ ఏడాది రాఖీ పౌర్ణమికి ఇంటి నుంచి వచ్చే రాఖీ కోసం ఎదురుచూస్తుంటా. – హరి మ్రిదా, రవీంద్రనగర్‌, మం.చింతలమానెపల్లి

లండన్‌ నుంచి వచ్చిన

చెన్నూర్‌రూరల్‌: నా పేరు అనూష. మాది చెన్నూర్‌ మండలం పొ క్కూరు గ్రామం. పెళ్లి తర్వాత లండన్‌లో స్థిరపడ్డాం. నా భర్త అక్కడే జాబ్‌ చేస్తాడు. ప్రతియేటా రాఖీ పండుగకు లండన్‌ నుంచి స్వగ్రామం వచ్చి అన్నయ్య గద్దె మధుకర్‌కు రాఖీ కట్టి వెళ్తుంటాను. ఈయేడు కూడా రెండ్రోజుల ముందుగానే వచ్చి రాఖీ కట్టాను. స్వయంగా వచ్చి రాఖీ కట్టడమే ఇష్టం. ఒక్కోసారి వచ్చే వీలు లేకుంటే ముందుగానే రాఖీ పంపిస్తాను. – గద్దె అనూష, లండన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement