వ్యూహం.. ప్రతివ్యూహం | - | Sakshi
Sakshi News home page

వ్యూహం.. ప్రతివ్యూహం

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

● రసకందాయంలో ‘కోఆప్షన్‌’ ఎన్నిక ● ఈనెల 31న బల్దియాలో సమావేశం ● పట్టు కోసం పాలక, విపక్షాల యత్నం ● ఎవరిది పైచేయి అవుతుందోనని ఆసక్తి

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. మరోసారి నిర్వహించాలని విపక్షాల పట్టుపడుతుండగా, పదవి ఆశిస్తున్న ఒకరు హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. ఎన్నికను పెండింగ్‌లో పెట్టాల ని పాలకపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిపై కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయగా ప్రతికూల నిర్ణయం వచ్చింది. సమావేశం ఎలాగైనా నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈనెల 31న మళ్లీ సమావేశం నిర్వహించాలని పాలకపక్షం నిర్ణయించింది. సమావేశం సాఫీగా జరిగితే నాలుగు కోఆప్షన్‌ సీ ట్లు పాలకపక్షం నుంచి చేజారే అవకాశముంది. సమావేశాన్ని నిరోధిస్తే మరికొంత కాలం విపక్షాన్ని నిరోధించినట్లవుతుంది. ఇలా వ్యూహ, ప్రతివ్యూహాలతో పాలక, విపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో 49మంది కౌన్సిలర్‌ స్థానాలుండగా, గత ఎన్ని కల్లో బీజేపీ 21, కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్‌ ఆరు, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు ఐ దు స్థానాల్లో గెలుపొందారు. ఎక్స్‌ అఫీ షియో సభ్యత్వం ద్వారా ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ స్థానాలను కలుపుకొని స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బల్దియా పీఠాన్ని దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా స్వతంత్ర కౌన్సి లర్‌ బండారి అనూషను చైర్‌పర్సన్‌గా ప్రతిపాదిస్తూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం జతకట్టాయి. మిగతా స్వతంత్రుల మద్దతు తీసుకుని బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. చైర్‌పర్సన్‌ బండారి అనూష భర్త బండారి సతీశ్‌తో కలిసి అప్పట్లోనే కాంగ్రెస్‌లో తిరిగి చేరడంతో ఆ పార్టీ బలం 12కు పెరిగింది. ఈ పరి ణామం తర్వాత కోఆప్షన్‌ పదవులనూ పాలకపక్షం సునాయసంగా దక్కించుకునేలా వ్యూహం వేస్తుంద ని అంతా భావించారు. కానీ, కోఆప్షన్‌ ఎన్నిక వచ్చే

సరికి రాజకీయాలు మా రాయి. నలు గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ పక్షాన నిలిచారు. బీజే పీ, స్వతంత్ర కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో ఓట్లు కలుపుకొని మెజార్టీ మార్క్‌ను ఇప్పటికే బీజేపీ సాధించింది. గత జూన్‌ 27న కోఆప్షన్‌ ఎన్నిక నిర్వహించగా, కోరం లేదంటూ, సమావేశం సాఫీగా నిర్వహించకుండా విపక్ష సభ్యులు ప్రతిఘటిస్తున్నారని ఆరోపిస్తూ పాలకపక్షం ఆ సమావేశాన్ని బహిష్కరించింది. తాజాగా మరోసారి ఎన్నిక నిర్వహిస్తుండడంతో అందరి దృష్టి అటువైపే మళ్లింది.

నాలుగు కోఆప్షన్‌ స్థానాలు ఇలా..

నాలుగు కోఆప్షన్‌ స్థానాలను భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇందులో జ నరల్‌ స్థానంలో ఇద్దరిని, మైనార్టీ స్థానంలో ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంది. రెండు స్థానా ల్లో తప్పనిసరిగా మహిళలను ఎన్నుకోవా ల్సి ఉంటుంది. ఇందుకోసం అప్పట్లో దరఖాస్తులు స్వీకరించగా, జనరల్‌ స్థానంలో 13 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మ హిళలున్నారు. మైనార్టీలో కూడా 13 దరఖా స్తులు రాగా, అందులో కూడా ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలున్నారు. ఇప్పు డు వీరి నుంచే ఆ నలుగురు కోఆప్షన్‌ సభ్యులను ఎ న్నుకోవాల్సి ఉంటుంది. రెండు నెలల కిందట నిర్వహించిన సమావేశంలో బీజేపీ, స్వతంత్ర, కోఆప్షన్‌ సభ్యుల సంఘటితంతో మెజార్టీ సాధించి నాలుగు సీట్లు కైవసం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అప్పు డు సమావేశం రద్దు కావడంతో ఇప్పటివరకు ఎన్ని క ఆగినా ఇప్పటికీ ఆ సంఘటితం అలాగే ఉంది. దీంతో సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలని విపక్షం, నిలువరించాలని పాలకపక్షం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ఎవరిది పైచేయి అవుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఎవరిది పైచేయి అవుతుందో!

ఆరోజు మున్సిపల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారని, అధికార, పాలకపక్షం దౌర్జన్యంగా కమిషనర్‌తో ఆ మీటింగ్‌ జరగకుండా చేసి కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికను నిలిపివేశారని విపక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో జరగబోయే సమావేశాన్ని సాఫీగా నిర్వహించాలని బీజేపీ, స్వతంత్ర సభ్యులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకోసం స్పెషలాఫీసర్‌ను కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా నీడలో ఎన్నిక సజావుగా నిర్వహించాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పాలకపక్షం ఈ సమావేశాన్ని ఎలాగైనా నిరోధించాలని, మరికొంత కాలం కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికను దాటవేయాలని ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత పరిస్థితులను అనువుగా మార్చుకుని ఎన్నికలకు వెళ్లొచ్చని భావిస్తోంది. ఈ ఎత్తుగడ ఫలిస్తుందో.. లేదో చూడాల్సిందే. కాగా, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రత్యేక సమావేశం ఈనెల 31న మధ్యాహ్నం 3గంటలకు కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జగద్వీర్‌ గౌడ్‌ తెలిపారు. సభ్యులంతా సకాలంలో హాజరుకావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement