ఆదిలాబాద్‌రూరల్: చెడు వ్యసనాల బారిన ప డొద్దని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. గురువారం మావల మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘వ్యసన రహిత యువత, ఆరోగ్యకరమైన సమాజం, అ భివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్యంతో ప్రతి ఒ క్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శక్తిని, సమయాన్ని విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీ డలు, పరిశోధన, దేశ సేవ వంటి సానుకూల కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు.


