ఆదిలాబాద్‌రూరల్: బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి వేడుకలనుజిల్లా కేంద్రంలో మంగళవారం అధికారికంగా నిర్వహించారు. బస్టాండ్ ఎదుట గల పాపన్నగౌడ్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన పాపన్నగౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సి పల్ చైర్‌పర్సన్ అనూష, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి సునీతకుమారి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, చరణ్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


