ఒంగోలు వన్‌టౌన్: ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్‌లో ఎదురయ్యే కరువు కాటకాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జ్ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి సీహెచ్‌వీ రామకృష్ణ అన్నారు. ఒంగోలు నగరంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడుతూ.. నీటి సంరక్షణ, వర్షపు నీటి సద్వినియోగం, చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. అనంతరం జడ్జి, హెచ్‌ఎంలు, అధ్యాపకులు సిబ్బందితో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంఈవో టి. కిషోర్ బాబు, హెచ్‌ఎం శివరాం, సీనియర్ అధ్యాపకులు తాతయ్య, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.


