ప్రతి బిడ్డకు స్క్రీనింగ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి బిడ్డకు స్క్రీనింగ్‌ చేయాలి

Aug 14 2026 8:38 AM | Updated on Aug 14 2026 8:38 AM

మద్దిపాడు: అంగన్‌వాడీ సెంటర్‌లో చేరిన ప్రతి బిడ్డకు స్క్రీనింగ్‌ చేసి వారి ఆరోగ్య సమస్యలు గుర్తించాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పద్మ సునంద ఆదేశించారు. జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా మద్దిపాడులోని కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆమె పాల్గొని మాట్లాడారు. నవ చేతన, ఆధార్‌శిల, స్క్రీనింగ్‌ల గురించి అవగాహన కల్పించారు. స్క్రీనింగ్‌ ద్వారా ఆరోగ్య సమస్యలున్న చిన్నారులను గుర్తించి వారిని పీహెచ్‌సీకి రిఫర్‌ చేయాలని, తద్వారా చిన్నారులకు వచ్చే ఆరోగ్య సమస్యలు అధిగమించవచ్చని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారా గృహ సందర్శనలు, తల్లులకు వర్క్‌షాపులు ఏర్పాటు చేసి టీఎల్‌ఎం తయారు చేసే ప్రక్రియలు నేర్పించాలన్నారు.

సంతనూతలపాడు: అంగన్‌వాడీ టీచర్లకు మండల స్థాయిలో నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. సంతనూతలపాడు మండలం చిలకపాడు హైస్కూల్లో ఈ నెల 11వ తేదీ ప్రారంభమైన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం పూర్తయింది. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు నాగరాజు, దేవసేన మాట్లాడుతూ ఆరేళ్లలోపు పిల్లల ఆరోగ్య సంరక్షణ, పోషణ, ప్రాథమిక అభివృద్ధిపై అంగన్‌వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్‌పర్సన్లుగా శేషుకుమారి, సునీత వ్యవహరించారు. అంగన్‌వాడీ టీచర్లు శిక్షణలో పాల్గొని అవగాహన పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement