దంత సమస్యలపై అశ్రద్ధ చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

దంత సమస్యలపై అశ్రద్ధ చేయొద్దు

Aug 14 2026 8:38 AM | Updated on Aug 14 2026 8:38 AM

దంత సమస్యలపై అశ్రద్ధ చేయొద్దు న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ సైన్సెస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

ఒంగోలు టౌన్‌: దంత ఆరోగ్యంపై అశ్రద్ధ చేయకుండా తగిన ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సూచించారు. నగరంలోని రెయిన్‌ బో డెంటల్‌ కేర్‌ సెంటర్‌లో అత్యాధునిక సీబీసీటీ త్రీడి సిటీ స్కానింగ్‌ను గురువారం ఎస్పీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్‌ వైద్య సేవ, ఈహెచ్‌ఎస్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ హేమంత్‌ మాట్లాడుతూ.. డెంటల్‌ ఇంప్లాంట్లు, జ్ఞాన దంతాల శస్త్ర చికిత్సలు, రూట్‌ కెనాల్‌ చికిత్స, దవడ సమస్యల చికిత్సలో త్రీడీ స్కానింగ్‌ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రారంభంలో హాస్పిటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు సిటీ: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని హోమ్‌ సైన్స్‌ విభాగంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ సైన్సెస్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ విభాగాధిపతి ఆచార్య ఎన్‌.రజని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్‌లో బైపీసీ లేదా ఎంపీసీ చదివి కనీసం 45 శాతం మార్కులు సాధించిన విద్యార్థినులు ఈ కోర్సుకు అర్హులన్నారు. న్యూట్రిషన్‌, హెల్త్‌ కేర్‌ రంగాలకు ప్రస్తుతం పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ఈ కోర్సు చేసిన విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. కోర్సు పూర్తిచేసిన అనంతరం డైటీషియన్‌, న్యూట్రిషనిస్ట్‌, సీడీపీఓ, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ప్రవేశాల కోసం ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ – సీఏపీ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 8374707898, 8985641616, 9550818367 నంబర్లను సంప్రదించాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement