దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: వెనుకబడిన దూదేకుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అజీమొద్దీన్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన వి లేకరులతో మాట్లాడారు. దూదేకుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.100 కోట్ల నిధులు కేటా యించాలని కోరారు. అలాగే జిల్లాకేంద్రంలో కమ్యూనిటీ హాల్ కోసం స్థలం కేటాయించాలన్నారు. గత ప్రభుత్వం ఆత్మగౌరవ భవన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిందని, అయితే మధ్యలోనే ఆగిపోయినట్లు తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో భవన నిర్మా ణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి షేక్ రఫీ, చాంద్‌పాషా, అబ్దుల్ ఖాదర్, షబానా బేగం తదితరులు పాల్గొన్నారు.


