ఇష్టపడి చదవాలి
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే లక్ష్యసాధన సులువవుతుందని అదనపు ఎస్పీ పి.మౌనిక అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియ ర్ కళాశాలలో మంగళవారం సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ఇంటర్ దశ ఎంతో కీలకమని, భవిష్యత్తు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నారు. అనంతరం విద్యార్థినులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీ ఐఈవో జాదవ్ గణేష్‌కుమార్, ఇన్‌చార్జి ప్రిన్సి పాల్ వెంకటేశ్వర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.


