ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా..
సాక్షి: ముందుగా మీకు ‘సాక్షి’ తరఫున శుభాకాంక్షలు.
చైర్‌పర్సన్: ధన్యవాదాలు అండి.
సాక్షి: మీ విజయానికి సహకరించిన అంశాలేమని భావిస్తున్నారు.?
చైర్‌పర్సన్: నా భర్త బండారి సతీశ్ పదేళ్లుగా 45వ వార్డు కౌన్సిలర్‌గా అందించిన సేవలు, అందరితో మమేకమై పనిచేసిన తీరు నాకు కలిసివచ్చింది. పారిశుద్ధ్య నిర్వహణ తీరు, తాగునీటి సరఫరాను నిత్యం పర్యవేక్షించడంతో పాటు ప్రజల సమస్యలను ఎ ప్పటికప్పుడు పరిష్కరించేలా చూపిన చొరవతోనే ప్రజలు మూడోసారి మమ్ములను అ క్కున చేర్చుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా విజయాన్ని అందించారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము.
సాక్షి: పట్టణ ప్రథమ పౌరురాలుగా ఎన్నికై న తర్వాత పట్టణంలో మీరు గుర్తించిన ప్రఽ దాన సమస్యలేంటి.. వాటి పరిష్కారానికి ఏ విధంగా ముందుకు సాగుతారు..?
చైర్‌పర్సన్: పట్టణంలోని ప్రతీ వార్డును నా సొంత వార్డుగానే భావిస్తాను. రోడ్లు, డ్రెయినేజీలు, పారిశుద్ధ్యనిర్వహణ, వీధిదీపాలు వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం కొరటా–చనాఖా నుంచి ప్రత్యేక పైపులైన్ ఏర్పాటుకు కృషి చేస్తాను. దీని ద్వారా పట్టణంలో వందేళ్ల వరకు నీటి సమస్య తలెత్తకుండా ఉంటుంది. చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తాను.
సాక్షి: పట్టణాభివృద్ధికి ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేశారు.. దాన్ని ఏ విధంగా అమలు చేస్తారు.?
చైర్‌పర్సన్: పట్టణంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు రూ.100 కోట్లతో ప్రత్యేక డీపీఆర్ సిద్ధం చేసి ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సూచించారు. విడతల వారీగా ఆ నిధులను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తాం. వార్డుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తాను.
సాక్షి: పట్టణ ప్రగతిపై మీ ముద్ర ఎలా ఉండబోనుంది.. ఏమైనా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తారా..?
చైర్‌పర్సన్: వార్డుల్లోని సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిరోజు ఒక వార్డులో మార్నింగ్ వాక్ నిర్వహిస్తాం. అలాగే ఆదివారం అధికార యంత్రాంగంతో కలిసి ప్రత్యేక గ్రీవెన్స్ చేపట్టాలని అనుకుంటున్నాం. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేలా కృషి చేస్తాం. పట్టణ పరిధిలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తాం. వాటిని వినియోగించినా, రోడ్లపై చెత్తవేసినా కఠినంగా వ్యవహరిస్తాం. అలాగే అన్యాక్రాంతమైన లీజు స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపడుతాం. దీనిపై న్యాయపరంగా సమస్య తలెత్తకుండా నిపుణులతో చర్చిస్తున్నాం.
‘ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా.. సమస్యలను ఎప్పుడైనా నా దృష్టికి తీసుకురావచ్చు.. వాటి పరిష్కారానికి కృషి చేస్తా.. పట్టణంలో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటా.. ప్రతీ వార్డును నా సొంత వార్డుగా భావిస్తూ వాటి అభివృద్ధికి కృషి చేస్తా.. పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతా..’ అని అంటున్నారు నూతనంగా ఎన్నికై న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష. మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు వెల్లడించారు. – కై లాస్‌నగర్
ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా..


