చీకటి ఒప్పందంతోనే బీఆర్‌ఎస్ మద్దతివ్వలేదు
ఆదిలాబాద్: మాజీ మంత్రి జోగు రామన్న చీకటి ఒప్పందంతోనే బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో మద్దతు ఇవ్వలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆ యన విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీలో 21 స్థానాలు గెలుచుకున్న బీజేపీకి మద్దతు ఇవ్వాలని తాను స్వయంగా కేటీఆర్‌కు ఫోన్ చేసి కోరా నని, అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ హామీ కూడా ఇచ్చారని వెల్లడించారు. కాంగ్రెస్‌కు ఎ ట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని ఆయన చెప్పినప్పటికీ, స్థానికంగా జోగు రామన్న ఆ మా టను పక్కనబెట్టారని విమర్శించారు. గత ము న్సి పల్ పాలకవర్గంలో తన కుమారుడు చేసిన అ వినీ తి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే, ఆయన బీజేపీకి మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్‌తో చేతులు కలిపారని ఆరోపించారు. ఇందులో మాజీ కౌన్సిలర్ జోగు రవి, బీజేపీ నాయకులు లాలా మున్నా, ధోని జ్యోతి హనుమాండ్లు, దినేష్‌మటోలియా, శ్రీకాంత్, జీవన్, రాకేష్ పాల్గొన్నారు.


