సర్పంచ్‌ల శిక్షణ పునః ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ల శిక్షణ పునః ప్రారంభం

Feb 18 2026 7:08 AM | Updated on Feb 18 2026 7:08 AM

సర్పంచ్‌ల శిక్షణ పునః ప్రారంభం

సర్పంచ్‌ల శిక్షణ పునః ప్రారంభం

కై లాస్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వా యిదాపడ్డ సర్పంచ్‌ల శిక్షణ తరగతులు జిల్లాలో మంగళవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్‌ రూరల్‌, బజార్‌హత్నూర్‌ మండలాల సర్పంచ్‌లకు స్థానిక జిల్లా పంచాయతీ వనరులకేంద్రంలో, ఉట్నూర్‌, సిరికొండ మండలాల సర్పంచ్‌లకు ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో గల వైటీసీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఉట్నూర్‌లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను జిల్లా పంచాయతీ అధికారి జి.రమేశ్‌ ప్రారంభించగా, జిల్లా కేంద్రంలో డీఎల్‌పీవో ఫణిందర్‌రావు ప్రారంభించారు. శిక్షణను సద్విని యోగం చేసుకుని గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని వారు సూచించారు. ఐదు రోజుల పాటు ఈ తరగతులు కొనసాగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement