● మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బండారి అనూష ● ఇండిపెండెంట్
విక్టరీ సింబల్ చూపుతున్న చైర్‌పర్సన్ అనూష, వైన్‌చైర్మన్ రోహిత్
చైర్‌పర్సన్‌కు మద్దతుగా చేతులెత్తిన కూటమి కౌన్సిలర్లు
కై లాస్‌నగర్: ఉత్కంఠకు తెరపడింది. ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం చివరకు కూటమి దక్కించుకుంది. మెజార్టీ వార్డులు కై వసం చేసుకుని రేసులో ముందు నిలిచిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. స్వతంత్రుల మద్దతు కూడగట్టడంలో విఫలమైన ఆ పార్టీకి నిరాశే ఎదురైంది. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతన చైర్‌పర్సన్‌గా 45వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందిన బండారి అనూష, వైస్‌చైర్మన్‌గా 44వ వార్డు ఎంఐఎం కౌన్సిలర్ మహ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. అయితే 49వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా సమావేశ హాల్‌లోకి కౌన్సిలర్లు మినహా ఇతరులెవరినీ అనుమతించలేదు. కొత్త సభ్యులు, మీడియా ప్రతినిధుల సెల్‌ఫోన్లను లోనికి తీసుకెళ్లకుండా ఆంక్షలు విధించారు. మున్సిపల్ ఉద్యోగులను సైతం గుర్తింపు కార్డులు ఉంటేనే పంపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిర్ణీత సమయానికే రాక..
ప్రత్యేక సమావేశానికి కొత్తగా ఎన్నికై న స భ్యులు సకాలంలో హాజరయ్యారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే శంకర్‌లు ఆ పార్టీ నుంచి గెలిచిన 21మందితో కలిసి ప్రత్యేక బస్సులో ఉదయం 10.30 గంటలకు ము న్సి పల్ కార్యాలయానికి చేరుకున్నారు. జై శ్రీరాం అంటూ నినదిస్తూ లోపలికి వెళ్లా రు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీని వాస్‌రెడ్డిలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లు కలిసి ఒకే బస్సులో ఉద యం 10.35 గంటలకు చేరుకున్నారు. ముందుగా డీసీసీ అధ్యక్షుడు బస్సు దిగి కార్యాలయంలోకి వెళ్లగా బస్సును ప్రధాన గేటు ఎదుట నిలి పారు. 20 నిమిషాల పాటు ఎవరూ దిగలేదు. విషయాన్ని గ్రహించిన ఎమ్మెల్యే శంకర్ వారున్న బస్సు వద్దకు వెళ్లారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి అక్కడే ఉండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరులను ఎందుకు రానిచ్చారని డీఎస్పీని ప్రశ్నించారు. మీ పార్టీ వారు కూడా వచ్చారంటూ డీఎస్పీ తెలుపగా తాను ఓటరునని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అక్కడి నుంచి వె ళ్లాలని డీఎస్పీ ఎమ్మెల్యేకు నచ్చజెప్పగా మీపై ఎ న్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానంటూ ఆయ న లోనికి వెళ్లారు. అనంతరం బీఆర్‌ఎస్, కాంగ్రెస్, స్వతంత్రులుగా ఎన్నికై న కౌన్సిలర్లు కార్యాలయంలోకి వెళ్లారు. మరో ఐదు నిమిషాల తర్వాత ఎంఐఎం సభ్యులు ఎంట్రీ ఇచ్చారు.
అభినందనలు ...
నూతనంగా ఎన్నికై న చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లకు మున్సిపల్ కమిషనర్ జి.రాజు పుష్పగుచ్ఛం అందజేశారు. అదనపు కలెక్టర్, పరిశీలకులు కూడా వారికి అభినందనలు తెలిపారు.
బల్దియా పత్యేకాధికారి, అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనుమంత్ నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. హాజరైన సభ్యులందరి సంతకాలు తీసుకున్నారు. మొత్తం 49 మంది సభ్యులకు గాను 48మంది సభ్యులు, ఇద్దరు ఎక్స్ అఫిషియో మెంబర్స్ హాజరయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 49వ వార్డు కౌన్సిలర్ వెనుగంటి ప్రకాశ్ సమావేశానికి దూరంగా ఉన్నారు. తొలుత సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీల పరంగా జారీ చేసిన విప్, బీ–ఫాంల వివరాలను అదనపు కలెక్టర్ చదివి వినిపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు స్వతంత్ర కౌన్సిలర్ బండారి అనూషకు విప్‌ను కేటాయించారు. బీజేపీ నుంచి 27వ వార్డు కౌన్సిలర్ జోగు శైలజకు విప్ జారీ చేశారు. అనంతరం చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహించారు. కూటమి అభ్యర్థిగా బండారి అనూషను కాంగ్రెస్ 40వ వార్డు సభ్యుడు సాయిచరణ్‌గౌడ్ ప్రతిపాదించగా, అదే పార్టీకి చెందిన 18వ వార్డు సభ్యురాలు తుమ్మల అన్నపూర్ణ బలపర్చారు. బీజేపీ తరఫున 27వ వార్డు సభ్యురాలు జోగు శైలజ పేరును ఎంపీ గోడం నగేశ్ ప్రతిపాదించగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ బలపర్చారు. చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించారు. జోగు శైలజకు అనుకూలంగా ఎంపీ, ఎమ్మెల్యేతో కలిపి 23 మంది చేతులెత్తగా, అనూషకు మద్దుతుగా కాంగ్రెస్ సభ్యులు 11మంది, బీఆర్‌ఎస్ నుంచి ఐదుగురు, ఎంఐఎం సభ్యులు ఆరుగురు, ఇండిపెండెంట్లు ఐదుగురు కలిపి 27 మంది చేతులెత్తారు. దీంతో అనూష చైర్‌పర్సన్‌గా ఎన్నికై నట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కూటమి తరఫున 44వ వార్డు ఎంఐఎం సభ్యుడు మహ్మద్ రోహిత్‌ను 37వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అంబకంటి సుష్మా ప్రతిపాదించగా, 23వ వార్డు సభ్యుడు సంజయ్ బలపర్చాడు. బీజేపీ తరఫున 46వ వార్డు సభ్యుడు ఓంప్రకాశ్‌జైస్వాల్‌ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రతిపాదించగా, ఎంపీ గోడం నగేశ్ బలపర్చాడు. ఎన్నిక నిర్వహించగా బీజేపీ అభ్యర్థికి ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి 23 రాగా, ఎంఐఎం అభ్యర్థికి 27 ఓట్లు వచ్చాయి. దీంతో రోహిత్ వైస్ చైర్మన్‌గా ఎన్నికై నట్లు ప్రకటించి సర్టిఫికెట్ అందజేశారు.


