కాంగ్రెస్‌లోకి అనూష..
కైలాస్‌నగర్: ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు సరైనదేనని ఆదిలా బా ద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్‌చార్జి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికై న బండారి అనూష ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె భర్త సతీశ్‌తో కలిసి నిజామాబాద్‌లోని సుదర్శన్‌రెడ్డి నివాసంలో సోమవారం కలిశారు. వారిని ఆయన ముందుగా అభినందించి శాలువాతో సత్కరించారు. అనంతరం కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. తమది సెక్యులర్ పార్టీ అని ఇతర సెక్యులర్ పార్టీల మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం దక్కించుకోవడం హర్షనీయమన్నారు. ఇందుకు సహకరించిన కౌన్సిలర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.


