ఆ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి
ఆదిలాబాద్: కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మా ట్లాడారు. ఆదిలాబాద్ పట్టణ ప్రజలు 21 కౌన్సిలర్ స్థానాలతో బీజేపీని ఆశీర్వదించినా, మున్సిపల్ పీఠం దక్కకుండా ఆ మూడు పార్టీలు అనైతిక పొ త్తులతో అడ్డుకున్నారని ఆరోపించారు. తమ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక, కుట్రపూరితంగా వ్యవహరించాయని విమర్శించారు. తాను అధి కారిక కార్యక్రమంలో పాల్గొంటే మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారన్నారు. ఇప్పుడు ఆ పార్టీ కౌన్సిలర్లను ఎన్ని కోట్లకు అమ్ముకున్నారని ప్రశ్నించారు. ఇప్పటినుంచి మాజీమంత్రి జోగు రామన్నను జోగు రఫిఉద్దీన్ అని పిలవాలన్నారు. ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా వ్యవహరించినా, తాము బాధ్యతాయుత ప్రతిపక్షంగా అన్ని విధాలు గా పట్టణ అభివృద్ధికి తోడ్పడుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు జోగు రవి, లాలా మున్నా, విజయ్, నగేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.


