అక్రమ సంపదను కాపాడుకునేందుకు గురుదక్షిణ
ఆదిలాబాద్‌టౌన్: ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన అక్రమ సంపదనను కాపాడుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆదిలాబాద్ మున్సిపాలిటీని గురుదక్షిణగా ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 21 మంది కౌన్సి లర్లు గెలుపొందినా బీజేపీ ఐదుగురు స్వతంత్రుల ను కూడగట్టలేకపోయిందని, తన శిబిరంలో ఇద్దరు స్వతంత్రులు ఉన్నప్పటికీ వారిని వెనక్కి పంపించారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. తనపై పాయల్ శంకర్ ఆరోపణలు చేయడం సరికాదని, భైంసా, అమరావతిలోని అకోల జిల్లాలో ఏవిధంగా ఎంఐఎం, బీజేపీ చైర్మన్, వైస్‌చైర్మన్‌లుగా ఎన్నికయ్యారని ప్రశ్నించారు. దొంగల్ని పారద్రోలాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీకి కే టాయించిన పార్టీ భూమిని సైతం అమ్ముకున్నార ని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నా యకులు మెట్టు ప్రహ్లాద్, సతీష్, సాజిదొద్దీన్, నారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


