శాస్త్రోక్తంగా శ్రవణా నక్షత్ర పూజలు
ఒంగోలు మెట్రో: శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఒంగోలు కొండమీద శ్రీగిరి వేంకటేశ్వర స్వామి దేవస్ధానంలో శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవస్థాన అర్చకుడు, వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నాద నీరాజనం, చతుర్వేద పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణతో పాటు భారత, భాగవత, భగవద్గీత రామాయణ శ్లోకాలను గానం చేశారు. గాయని ఫణిదీప్తి అన్నమయ్య సంకీర్తనలను మృదు మధురంగా ఆలపించి భక్తులను అలరించారు. కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీ రాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కార్య నిర్వాహణ ధర్మకర్త సి వి రామకృష్ణారావు, ధర్మకర్తలు పాల్గొన్నారు.


