మహాసభను సక్సెస్ చేయాలి
నార్నూర్: ఈ నెల 23న ఉట్నూర్ ఎంపీడీవో కార్యాలయ మైదానంలో నిర్వహించనున్న ఆ దివాసీ ధర్మయుద్ధం మహాసభను విజయవంతం చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందూర్ దాదిరావు కోరారు. గురువారం మండలంలోని మాన్కాపూర్ గ్రామంలో గ్రా మపటేల్ మెస్రం రూప్‌దేవ్ ఆధ్వర్యంలో ఆది వాసీ ధర్మయుద్ధం పోస్టర్ ఆవిష్కరించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించా లనే ఏకై క డిమాండ్‌తో తలపెట్టిన మహాసభకు ఆదివాసీలు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావు, జామ్‌డా రాయి సెంటర్ సార్‌మెడి కొట్నాక్ కృష్ణ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండలాధ్యక్షుడు పూసం ఈస్రు పాల్గొన్నారు.


