బంగారుగూడలో కార్డన్ సెర్చ్
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ రూరల్ పోలీ స్‌స్టేషన్ పరిధిలోని బంగారుగూడలో గురువా రం ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్ ఆధ్వర్యంలో కా ర్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 60ద్విచక్రవాహనాలు, 10ఆటోలు, రెండు మ్యాక్స్ వాహనాలు, మూడు బెల్ట్‌షాపుల్లోని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించా రు. సీఐలు ఫణిధర్, నాగరాజు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మురళి, ఎస్సైలు విష్ణువర్ధన్, చంద్రశేఖర్, రాధిక, జీవన్‌రెడ్డి, రాకేశ్, సిబ్బంది ఉన్నారు.


