● కేవీకేలో అగ్రిక్చలర్ కళాశాల ● సరిపడా లేని గదులు, వసత
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లో గల కృషి విజ్ఞాన కేంద్రంలో కొనసాగుతున్న అగ్రికల్చర్ కళాశాల పరిస్థితి అధ్వానంగా మారింది. ఇక్క డ 2023లో తరగతులు ప్రారంభం కాగా, సరైన వ సతులు లేవు. ఈ విద్యా సంవత్సరం ఇక్కడ అగ్రికల్చర్ బీఎస్సీలో అడ్మిషన్లు పొందిన 60మంది ఫస్టియర్ విద్యార్థులు జగిత్యాలలోని కళాశాలలో తరగతులకు హాజరుకావాల్సి వస్తోంది. ద్వితీయ, తృతీ య సంవత్సరం విద్యార్థులు ఇక్కడే ఉన్నప్పటికీ కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.
కొనసా..గుతున్న భవన నిర్మాణం
అగ్రికల్చర్ కళాశాల భవన నిర్మాణం కోసం సాత్నా ల ప్రాంతంలో భూమి కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో కేవీకేలోనే తాత్కాలికంగా తరగతులు ప్రారంభించా రు. అనంతరం ఏఆర్‌ఎస్ వ్యవసాయ పరిశోధనకు సంబంధించిన భూమిలోనే తరగతి గదులు, హాస్ట ల్ కోసం భవన నిర్మాణం చేపట్టారు. మరో ఏడాది దాటినా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలే దు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు పూర్తిస్థాయిలో గదులు లేవు. తొమ్మిది ల్యాబ్‌ల అవసరం ఉండగా, నాలుగింటితోనే సరిపెడుతున్నారు. కేవీకేలోని ఇరుకైన పాత భవనాన్ని బాలికల హాస్టల్ కు కేటాయించగా ఇబ్బందులు తప్పడంలేదు.
అక్కడా వసతులు అంతంతే..
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇ బ్బందులు తప్పడం లేదు. ఇక్కడే అడ్మిషన్లు పొంది ఇక్కడే ఫీజులు చెల్లిస్తున్నా తరగతులు మాత్రం జగి త్యాల వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్నారు. జగిత్యాలలోని కళాశాలలో బాలికలకు వసతి సౌకర్యం లేదు. ఊరుబయట వ్యవసాయ కళాశాల ఉండగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కళా శాలకు యూనివర్సిటీ 40 పోస్టులు కేటాయించగా, ప్రస్తుతం అసోసియేట్ డీన్‌తోపాటు తొమ్మిది మంది బోధన సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఆరుగురు రెగ్యులర్ కాగా, ముగ్గురు కాంట్రాక్ట్ ఉద్యోగులతో కళాశాలలో విద్యాబోధన సాగుతోంది.
● కేవీకేలో అగ్రిక్చలర్ కళాశాల ● సరిపడా లేని గదులు, వసత


