గోల్‌మాల్ గురువుల్లో గుబులు !
ఆదిలాబాద్‌టౌన్: పీఎంశ్రీ నిధులు దుర్వినియోగం చేసిన గురువుల బాగోతం బయటపడనుంది. జి ల్లాలో ఈ పథకానికి 24పాఠశాలలు ఎంపికయ్యా యి. ఒక్కో పాఠశాలకు ఐదేళ్లలో రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు నిధులు మంజూరు కానున్నా యి. ఇప్పటివరకు హెచ్‌ఎంల ఖాతాల్లో జమ చేసిన నిధులను ఇష్టారీతిన ఖర్చు పెట్టారు. జీఎస్టీ బిల్లులు పెట్టి అందిన కాడికి దండుకున్నారు. దీనిపై ఇటీవల ‘సాక్షి’ లో ‘పీఎం’ గోల్‌మాల్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారులు దీ నిపై దృష్టి సారించారు. ఆరా తీసేందుకు కేంద్ర వి ద్యాశాఖ డీవోఈఎస్‌ఐకి సంబంధించి ఐఏఎస్ అధి కారి ప్రీతిమీనన్, కన్సల్టెంట్ గురుప్రీతికౌర్, ఓ స భ్యుడు, పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రా జీవ్ బృందం జిల్లాలో పర్యటించనుంది.
ఇష్టారీతిన స్వాహా..
బతుకమ్మ వేడుకల నిర్వహణ నిధులు, ఎక్స్‌పోజర్, ఫీల్డ్ విజిట్ కోసం విద్యార్థులకు ఖర్చు చేయాల్సిన సొమ్ము, గార్డెన్, స్పోర్ట్స్ సామగ్రి, మౌలిక వసతుల కల్పన.. ఇలా వివిధ అవసరాల కోసం విడుదలైన డబ్బులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. తని ఖీ బృందాలు పీఎంశ్రీ పాఠశాలలను తనిఖీ చేస్తే వారి అక్రమాలు బయటపడతాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.
తనిఖీలు పకడ్బందీగా జరిగేనా?
గతంలో ఈ వ్యవహారంపై నామమాత్రంగా తనిఖీ చేసిన కొందరు ఆడిట్ అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంతో వీరి బాగోతం బయటపడలేదనే ఆరోపణలున్నాయి. అయితే నేడు రానున్న తనిఖీ బృందాల్లోని అధికారులు నామమాత్రంగా తనిఖీ చేస్తారా?.. లేదా.. కాజేసిన నిధులు కక్కిస్తారా? అ నేది తేలనుంది. ఈ విషయమై విద్యాశాఖ సెక్టోరల్ అధికారి రఘురమణను సంప్రదించగా, కేంద్ర వి ద్యాశాఖకు సంబంధించి ఐఏఎస్ అధికారి ప్రీతిమీ నన్ బృందం, జాయింట్ డైరెక్టర్ రాజీవ్ బృందం జిల్లాలో తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. బోథ్ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు పలు పీఎంశ్రీ పాఠశాలలను తనిఖీ చేయనున్నట్లు వివరించారు.


