అవినీతిపై ఏసీబీ కత్తి!
ఏసీబీ దూకుడుతో లంచగొండులకు జైలే.. పక్కా ప్రణాళికతో దాడులు, అధికారులకు ముచ్చెమటలు ఉమ్మడి జిల్లాలో 11నెలల్లో 20 కేసులు నమోదు ఫిర్యాదులపై పౌరుల్లోనూ పెరుగుతున్న చైతన్యం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: లంచగొండి అధికారుల్లో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దడ పుట్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఉమ్మడి జిల్లాలో ఆ యా శాఖల్లో అధికారులను వలపన్ని పట్టేస్తోంది. నెలనెలా రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ తమ ఉ ద్యోగ బాధ్యతలు నిర్వర్తించాల్సిన కొందరు అ ధికా రులు అత్యాశకు పోతున్నారు. ప్రతీ పనికి ఓ ధర ని ర్ణయించి డబ్బులు దండుకుంటున్నారు. ప్రజలకు నిత్యం సేవలందించే ప్రభుత్వశాఖల్లో చాలామంది అధికారులు లంచాలకు మరిగారు. దీంతో ఏ పని చేయాలన్నా పైసలు ముట్టజెప్పాల్సి వస్తోంది. కొ న్నిచోట్ల ఆయా స్థాయిలో వ్యవస్థీకృతంగా వసూళ్లు చేసుకుంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెవె న్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో అధికా రులు అధికంగా లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చి క్కారు. వీరితోపాటు పోలీస్, లేబర్, మార్కెటింగ్, హెల్త్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, సహకార, సివిల్ సప్లయ్ శాఖల్లోని అధికారులు ఏసీబీ వలకు చిక్కా రు. రూ.లక్షల సొమ్ము సీజ్ చేసి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ సాగుతోంది. ఏసీబీ కేసులతో అధికారులు సస్పెన్షన్‌కు గురవుతున్నారు.
11 నెలల్లో 20కేసులు
ప్రభుత్వ అధికారుల్లో ఏళ్లుగా పాతుకుపోయిన అవి నీతి జాఢ్యాన్ని ఏసీబీ వదిలిస్తోంది. ఫిర్యాదు ఇవ్వగానే అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో లంచగొండుల్లో వణుకు పుడుతోంది. దీంతో ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఏసీబీ వలకు చిక్కుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత 11నెలల్లో 20 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి జి ల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాలలో కార్యాలయాలు ఉన్నాయి. గత మేలో నస్పూర్‌లో కార్యాలయం ప్రా రంభం కాగా, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల వా రికి ఫిర్యాదులు చేసేందుకు మరింత చేరువైంది. దీంతో బాధితులు నేరుగా కార్యాలయానికి వెళ్లే అ వకాశముంది. నస్పూర్‌లో కార్యాలయం మొదలైననుంచి ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలోనే 15 కే సులు నమోదు కావడం గమనార్హం. ఇవే కాకుండా ఆదాయానికి మించి ఆస్తులు, రాష్ట్ర ఉన్నతాధికారు ల ఆదేశాలతో అవినీతికి ఆస్కారమున్న ఆఫీసుల్ల్లోకి ఆకస్మికంగా వెళ్లి ఫైళ్లు, రికార్డులు పరిశీలిస్తున్నారు. నగదు, ఆన్‌లైన్ అనుమానిత లావాదేవీలపై దృష్టి సారించి కూపీ లాగుతూ విచారణ చేస్తున్నారు.
జాగ్రత్త పడుతున్న అధికారులు
ఎవరైనా బాధితులు ఏసీబీని ఆశ్రయించగానే అధి కారులు పక్కా ప్రణాళికతో దాడులు చేస్తున్నారు. ఒ క్కోసారి సినిమాల్లో మాదిరి అధికారులు వల పన్ని పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా మంచి ర్యాల, బెల్లంపల్లిలో ఒకేరోజు ఒకే సమయంలో ఒకే కార్మిక శాఖలో ఇద్దరు అధికారులను పట్టుకుని సంచలనం సృష్టించారు. గతంలో ఏడాదికి పదిలోపు కూడా కేసులు నమోదయ్యేవి కావు. దీంతో పౌరుల్లోనూ చైతన్యం లేక సర్కారు కార్యాలయాల్లో లంచాలు ఇవ్వడానికే చాలామంది అలవాటు పడ్డారు. ఇక కొందరైతే ఆయా శాఖల్లోని అధికారులకు డ బ్బులు చెల్లించుకోలేని వాళ్లు తమ సమస్యలు పరి ష్కారం కాక ఉండిపోయిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు మారిపోవడంతో చాలామంది అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఏసీబీని ఆశ్రయిస్తున్నారని లంచం తీసుకునేందుకు భయపడు తున్నారు. మరికొందరు అధికారులు మాత్రం తమ వక్రబుద్ధిని వేర్వేరు మార్గాల్లో ప్రదర్శిస్తున్నారు.
లంచమడిగితే..ఒకే ఫోన్‌కాల్
ఎవరైనా అధికారులు డబ్బులు అడిగితే ఆదిలాబా ద్, నస్పూర్‌లో ఉన్న ఏసీబీ కార్యాలయాలకు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106, dg& acb@telangana. gov. in కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఏసీబీ డీఎస్పీ నంబర్ 91543 88963కు నేరుగా కాల్ చేసి వివరాలు అందిస్తే అ ధికారులు సూచించినట్లు చేసి అవినీతి అధికారుల ఆట కట్టించవచ్చు. అధికారులు తమ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడితే ఆధారాలతోనూ ఫిర్యా దు చేయవచ్చు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు చెబు తున్నారు. అలాగే బాధితులకు ఆయా శాఖల్లో తమకున్న సమస్య తీరిపోతుందని చెబుతున్నారు.


