‘స్థానిక’ం.. వేగిరం | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ం.. వేగిరం

Nov 21 2025 9:53 AM | Updated on Nov 21 2025 9:53 AM

‘స్థానిక’ం.. వేగిరం

‘స్థానిక’ం.. వేగిరం

● డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు ● రిజర్వేషన్లపై ఇంకా వీడని ఉత్కంఠ ● 50శాతానికి మించకుండా నిర్వహణ ● మళ్లీ జనాల్లోకి వెళ్తున్న ఆశావహులు

కైలాస్‌నగర్‌: ఆశావాహులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న పంచాయతీ సమరానికి ముహుర్తం ఖరారైనట్లే కనిపిస్తోంది. డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే షెడ్యూల్‌ విడుదల చేసేందు కు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఓట ర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టిన ఎన్నికల కమి షన్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. దీంతో త్వరలో పంచాయతీ నగారా మోగే అవకా శం ఉండటంతో పల్లె రాజకీయం వేడెక్కింది.

పాత రిజర్వేషన్ల ప్రకారమే..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌, వార్డు మెంబర్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. అయితే.. ఇందుకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కావడంతో విచారించిన కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు ఆదేశాలను సమర్థిచింది. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచి పోయింది. అయితే ఈ నెల 24న మరోసారి హైకో ర్టులో విచారణ జరగనుండగా ప్రభుత్వం రిజర్వేష న్ల అమలుపై స్పష్టమైన నివేదిక ఇవ్వనుంది. హైకో ర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్న ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వె ళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే వీటిని రొటేషన్‌ చేస్తారా?.. కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారా? అనేది హైకోర్టు తీర్పు తర్వాత స్పష్టత రానుంది.

మొదలైన ఎన్నికల సందడి

డిసెంబర్‌ ఒకటి నుంచి 9వరకు ప్రజాపాలన వారో త్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ కార్యక్రమం ముగిశాక ఎన్నికల షెడ్యూల్‌ వి డుదలయ్యే అవకాశముంది. గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్ర ధాన అధికారి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, సామగ్రిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. అర్హులైన యువతకు ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా చేపడుతున్నారు. కొత్తగా దరఖాస్తులు స్వీకరించడంతో పాటు జాబితాలో మార్పులు, చేర్పులు చేపట్టి ఈ నెల 23న ఓటర్ల తుది జాబితా వెల్లడించనున్నారు. ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తుండటం.. మార్చిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రమిచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు రద్దయ్యే అవకాశమున్నట్లు మంత్రివర్గం ప్రకటించడం.. గమనిస్తే ఈసారి పంచాయతీ నగారా మోగే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది.

పట్టు నిలుపుకొనే యత్నాల్లో పార్టీలు

పంచాయతీ సమరంపై ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఎ న్నికలు పార్టీ గుర్తుల ప్రకారం నిర్వహించనప్పటికీ పల్లెల్లో తమ పట్టు నిలుపుకొనేందుకు ఈ ఎన్నికల ను కీలకంగా భావిస్తున్నాయి. మద్దతుదారులను గె లిపించుకుంటే పార్టీపరంగా నిర్వహించే ఎన్నికలకు కలిసి వస్తుందని ఆశిస్తున్నాయి. ఆ దిశగా ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వివరాలు ఆరా తీస్తున్నా యి. పోటీకి సై.. అంటున్న ఆశావహులూ పార్టీ, ప్ర జల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది.

జిల్లా సమాచారం

గ్రామ పంచాయతీలు 473

వార్డు స్థానాలు 3,870

పల్లె ఓటర్లు 4,49,981

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement