
ఆ విత్తనాలు మొలకెత్తలే..
ఈ సీజన్‌లో నాకున్న 4.31 ఎకరాల్లో సోయాబిన్ సాగు చేశా. అగ్రికల్చర్ రిసెర్చ్ సెంటర్ ఆదిలాబాద్ వారి నుంచి రూ.1600 నగదు చెల్లించి జేఎస్ 335 రకం ఐదు సంచుల విత్తనాలను కొనుగోలు చేశాను. వాటికి లాట్ నంబర్ లేకుండానే నాకు రశీదు ఇచ్చారు. ప్రభుత్వ విత్తనాలని నమ్మితే అవి మొలకెత్తనేలేదు. స్థానిక ఏఈఓ, తలమడుగు ఏవోలను కలిసి లిఖితపూర్వకంగా సమస్యను వివరించినా వారు పట్టించుకోవడం లేదు. పంట నష్టపోయిన నాకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
– గోనెల నర్సింలు, రుయ్యాడి, తలమడుగు