డీపీవోగా రమేశ్ బాధ్యతలు
● మూడు నెలల నిరీక్షణకు ఎట్టకేలకు తెర
కైలాస్‌నగర్: జిల్లా పంచాయతీ అధికారిగా గుడిపెల్లి రమేశ్ సోమవారం ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించారు.దీంతోపాత,కొత్తఅధికారుల మధ్య ఈ పోస్టుపై మూడునెలలుగా నెలకొన్న ప్ర తిష్టంభనకు తెరపడింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డీపీవోగా ఉన్న శ్రీలతను కమిషనర్ కా ర్యాలయానికి బదిలీ చేసిన ప్రభుత్వం నిర్మల్ డీఎల్‌పీవోగా పనిచేస్తున్న రమేశ్‌ను ఇక్కడ నియమించింది. ఈఏడాది ఫిబ్రవరి 14న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలకోడ్ అమల్లో ఉండడంతో డీ ఎల్‌పీవోగా ఉన్న ఆయన్ను రీడిప్లాయ్‌మెంట్ కింద డీపీవోగా నియమిస్తూ అదే నెల 25న మరో సారి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో అదేనెల 27న నిర్మల్ డీఎల్‌పీవోగా రిలీ వై జిల్లాలో విధుల్లో చేరేందుకు వచ్చిన ఆయన కలెక్టర్‌ను కలిశారు. అయితే కోడ్ ముగిసేవరకు వేచి ఉండాలని కలెక్టర్ ఆయనకు సూచించారు. తీరా కోడ్ ముగిసినా విధుల్లో చేర్చుకోలేదు. దీంతో అప్పటి నుంచి ఆయన ఏ పోస్టులోలేకుండా వెయిటింగ్‌లోనే కొనసాగారు. తాజాగా రమేశ్‌ను తప్పనిసరి గా విధుల్లో చేర్చుకోవాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఈనెల 24నఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కలెక్టర్‌ను రమేశ్ మర్యాదపూర్వకంగా కలిసి రిపోర్టు చేశారు.


