
ప్రదర్శనకు ఎంపికై న చిత్రం
జైపూర్: ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఏలూరి శేషబ్రహ్మం కాకతీయ శిల్ప సంపద గురించి తెలుసుకునేందుకు జనవరి 25, 26 తేదీల్లో నిర్వహించిన కాకతీయ టెంపుల్ స్కెచింగ్ స్టడీ టూర్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 60 మంది ఆర్టిస్టులు పాల్గొని పలు చిత్రాలు గీశారు. వాటిలో నుంచి ఎంపికై న చిత్రాలతో ఈ నెల 12 నుంచి 14 వరకు మాదాపూర్‌లోని తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మంచిర్యాల జిల్లాకు చెందిన చిత్రకారుడు చిప్పకుర్తి శ్రీనివాస్ కాకతీయ శిల్పసంపదపై గీసిన చిత్రం ప్రదర్శనకు ఎంపికై ంది.
మట్కా నిందితుల అరెస్టు
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన అగ్ని బాబులాల్ అమాయక ప్రజలకు మట్కా చీటీలు అందజేస్తూ పట్టుబడినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తాంసి బస్టాండ్ వద్ద మట్కా చీటీలు రాస్తుండగా దాడిచేసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.730 నగదుతో పాటు సెల్‌ఫోన్, మట్కా పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఆన్‌లైన్ మట్కా నిర్వాహకుడు..
ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన మసూద్ ఖాన్ ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహణ చేస్తున్నాడు. మహారాష్ట్రలోని గుర్లాయికి సంబంధించిన సంస్థకు డబ్బులు పంపిస్తుండగా పట్టుకున్నట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. నిందితుడి నుంచి నాలుగు సెల్‌ఫోన్‌లతో పాటు రూ.5,800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి బైండోవర్ చేసినట్లు వివరించారు.