జైళ్లు సరిపోతలేవు.. !
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రోజు రోజుకు పెరిగిపోతున్న నేరాల తీవ్రతకు రిమాండ్, విచారణ ఖైదీల తాకిడికి జైళ్ల సామర్థ్యం సరిపోవడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదిలాబాద్ కేంద్రంగా జిల్లా కారా గారం కొనసాగుతుండగా.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, ఆసిఫాబాద్ సబ్ జైళ్లు, నిర్మల్‌లో స్పెషల్ సబ్ జైలు ఉన్నాయి. ఆయా జైళ్ల సామర్థ్యాన్ని బట్టి విచారణ ఎదుర్కొంటున్న వారిని కోర్టు ఆదేశాల మేరకు జైళ్లలో ఉంచాల్సి ఉంటుంది. ఈ మేరకు వా రికి తగిన వసతులు, సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. వివిధ కేసుల్లో జైలుకు వస్తే కనీసం మూడు రోజుల నుంచి మూడు నెలల వరకు, రిమాండ్‌పై వచ్చే వాళ్లు ఉంటున్నారు. నేర తీవ్రతను బట్టి ఆయా కేసుల్లో బెయిల్ వచ్చేదాకా జైలులో ఉండాల్సి ఉంటుంది. ఇక రెండేళ్ల వరకు శిక్ష విధించిన వారిని ఆదిలాబాద్ జైలులో ఉంచుతున్నారు. మగ ఖైదీలతో పోలిస్తే మహిళలకు ప్రత్యేక బ్యారక్‌లు కేటాయించాల్సి ఉంది.
నిజాం కాలం నాటివి..
ఆసిఫాబాద్, లక్సెట్టిపేట సబ్‌జైళ్లు నిజాం కాలంలో నిర్మించినవి. ఆసిఫాబాద్ జైలు మొదట జిల్లా జై లుగా ఉండేది. తర్వాత ఆదిలాబాద్‌కు మార్చారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్న లక్సెట్టిపేట జైలు సామర్థ్యం కంటే అధికంగా కేసులు న మోదవుతున్నాయి. దీంతో విచారణ ఖైదీలను ఆది లాబాద్‌కు తరలిస్తున్నారు. జిల్లాలు ఏర్పడినప్పటికీ నాలుగు జిల్లాల్లో సబ్ జైళ్లుగానే కొనసాగుతున్నా యి. ఈ క్రమంలో నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోనూ కొత్త జైళ్లు నిర్మించాలని ఆ శాఖ అధికారులు కలెక్టర్ల కు వినతిపత్రాలు ఇచ్చారు. ఒక్కో జైలు నిర్మాణాని కి 25 ఎకరాల భూమితోపాటు రూ.95 కోట్లు అవస రం. జిల్లా కేంద్రం సమీపం, చుట్టుపక్కల నిర్మిస్తే ఖైదీల కుటుంబాల రాకపోకలకు వీలుగా ఉంటుంది. కొత్త జిల్లా కేంద్రాల్లో సర్కారు భూముల లభ్యత లేకపోవడంతో కొత్త కారాగారాల నిర్మాణంలో జా ప్యం జరుగుతోంది. ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భూదాన్ భూముల్లో 12 ఎకరాల్లో జిల్లా జైలు కోసం భూమి ఇచ్చేందుకు సర్వే చేశారు. జైళ్ల శాఖ నుంచి అనుమతి వస్తే కొత్త జైలు నిర్మాణానికి ఆస్కారం ఏర్పడనుంది. నిర్మల్ పరిధిలోనూ కొత్త జైలు నిర్మించాల్సిన అవసరం ఉంది.
పెరుగుతున్న నేరాలతో సమస్య
లక్సెట్టిపేట సబ్ జైలుకు అధికంగా తాకిడి
కొత్తగా జిల్లా కారాగారాలు నిర్మిస్తేనే ఊరట


