దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌  - Sakshi

‘ప్రజాపాలన’ కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్కులు

‘రైతుబంధు’ అందుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవాలి

బోగస్‌ ఆధార్‌కార్డులు జారీచేస్తే కఠిన చర్యలు

మీడియా సమావేశంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆదిలాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల ను అర్హులైన ప్రతీ కుటుంబానికి ఉచితంగా అందజేస్తున్నామని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. జిల్లాలో దరఖాస్తుల కొరత లేదని ప్రతి గ్రామం, ము న్సిపల్‌ వార్డులో ఉన్న కుటుంబాల కంటే పది శా తం అదనంగా పంపించామన్నారు. మీసేవ, జిరా క్స్‌ కేంద్రాలు, దళారులు విక్రయించినట్‌లైతే చర్యలు తప్పవన్నారు. మీసేవ కేంద్రాల లైసెన్స్‌ రద్దుతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆరు గ్యారంటీల దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. దరఖాస్తు నింపేందుకు కొంతమంది రూ.50వరకు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా జరుగకుండా అన్ని చోట్ల వాటిని నింపేందుకు ప్రత్యేక హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీలకు ఒకే కా మన్‌ దరఖాస్తు పత్రం ఉంటుందని, అందులో అవసరమైన సాయంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రేషన్‌కార్డు లేని వారు, ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్‌ అని ఉన్న వారు కూడా నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

పింఛన్‌ పొందుతున్న ల బ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, రైతుబంధు సాయం పొందుతున్న రైతులు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్తగా రేషన్‌కార్డు పొందాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అద్దె ఇళ్లలో నివసించేవారు గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ కోసం అద్దె ఇంటి విద్యుత్‌ సర్వీస్‌ నంబర్‌తోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఇ బ్బందులు పడుకుండా ఉండేలా అన్ని కేంద్రాల్లో షామియానాలు, తాగునీటి వసతి కల్పించామన్నారు. జనవరి 6వరకు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, అప్పటికీ అందించలేని వారు కూడా ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో అందజేయవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు.

డబ్బులిస్తే ఇప్పిస్తామని నమ్మబలికే దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సంక్షేమ ఫలాల కోసం మహారాష్ట నుంచి వచ్చే వారికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తే మాత్రం బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని వార్డుల్లో జనాభా ఎక్కువగా ఉన్నందున ప్రతి వార్డుకు ఓ జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లుగా వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు.

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top