తమ్ముడు నేవీలో.. అన్న పోలీసు ఉద్యోగంలో | - | Sakshi
Sakshi News home page

తమ్ముడు నేవీలో.. అన్న పోలీసు ఉద్యోగంలో

Oct 29 2023 12:12 AM | Updated on Oct 29 2023 8:50 AM

- - Sakshi

సారంగపూర్‌: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నాతమ్ముళ్లు నెలరోజుల వ్యవధిలోనే రెండు ఉద్యోగాలు సాధించి శభాష్‌ అనిపించుకున్నారు. మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన మాన్పూరి లక్ష్మణ్‌–లక్ష్మీలకు ముగ్గురు సంతానం. ఇందులో పెద్ద కుమార్తెకు వివాహం కాగా ఇద్దరు కుమారులు లక్ష్మిరాజు, వినేష్‌ ఉన్నారు. అయితే బీడీ కంపెనీ నిర్వహిస్తూ ఇద్దరు కుమారులను తల్లిదండ్రులూ కష్టపడి చదివించారు.

వారి కోరుకున్నట్లే పెద్దవాడైన లక్ష్మిరాజు ఇటీవల కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. నెలరోజుల వ్యవధిలోనే రెండురోజుల క్రితం విడుదలైన నావికాదళం(నేవి) ఉద్యోగానికి అతడి తమ్ముడు వినేష్‌ ఎంపికయ్యాడు. శుక్రవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నాడు. తమ్ముడు దేశ రక్షణ దళంలో, అన్న రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే ఉద్యోగం సాధించడంపై మండల ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తూ శభాష్‌ సోదరులారా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement