కై లాస్‌నగర్/నేరడిగొండ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఇచ్చిన ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఢిల్లీలో పాదయాత్ర చేపట్టారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ నాయకత్వంలో కాంగ్రెస్ జెండాలతో తరలివెళ్లారు. ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, సాజిద్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.


