‘సంకల్ప్–10 డేస్ ఫర్ ఎఫ్‌ఎల్‌ఎన్’కు శ్రీకారం
ప్రాథమిక స్థాయిపై కలెక్టర్ ఫోకస్
విద్యార్థులు, టీచర్ల అటెండెన్స్‌పై దృష్టిపెట్టిన సర్కారు
ప్రత్యేక హాజరు మాసంగా నవంబర్
విద్యార్థులకు చదువు రావాలన్నదే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: అక్షర క్రమంలో ముందున్న ఆది లాబాద్ జిల్లా సర్కారు బడుల్లో చదువుల పరంగా వెనుకబడే ఉంటుంది. అనేక కార్యక్రమాలకు శ్రీకా రం చుడుతున్నా ఆశించినస్థాయిలో ఫలితాలు రావ డం లేదు. ఇందుకు కారణాలనేకం ఉన్నాయి. ఉపాధ్యాయుల పనితీరు, అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సర్వేల్లో అభ్యసన సామర్థ్యాల పరంగా జిల్లా చివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ రాజర్షిషా ‘సంకల్ప్–10 డేస్ ఫర్ ఎఫ్‌ఎల్‌ఎన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించి చదవడం, రాయడం రాని విద్యార్థులపై ఫోకస్ పెట్టారు. ఈనెల 4 నుంచి 17వరకు ఈకార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు విద్యా శాఖాధికారులు కార్యక్రమాన్ని పకడ్బందీగాఅమలుచేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
చదువు రావాలనే ‘సంకల్పం’తో..
కలెక్టర్ రాజర్షిషా ఇప్పటికే విద్యాశాఖకు సంబంధించి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభు త్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమం, విద్యా ప్రశ్ వంటి కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టగా తాజాగా ‘సంకల్ప్–10 డేస్ ఫర్ ఎఫ్‌ఎల్‌ఎన్’ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించి, వారి స్థాయి ని గుర్తిస్తారు. అక్షరాలు, అంకెలను గుర్తించని, గు ణింతాలు రాని వారిని, ఇంగ్లిష్ పదాలు చ దవరాని విద్యార్థులను నాన్ అచీవ్‌మెంట్‌గా పరిగణిస్తారు. చదవడం, రాయడం వచ్చినవారికి అచీవ్‌మెంట్‌గా గుర్తిస్తారు. పది రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యే క తరగతులు నిర్వహించి వారిని సంసిద్ధులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, సెక్టోరి యల్ అధికారులతో పాటు డీఈవో పర్యవేక్షించేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పది రోజుల తర్వాత తిరిగి వారి సామర్థ్యాలు పరీక్షించనున్నారు. అప్పటికీ అచీవ్‌మెంట్ సా ధించని విద్యార్థులకు మరో సారి విద్యా సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల వివరాలు..
డీఈవో పరిధిలోని పాఠశాలలు 678
విద్యార్థుల సంఖ్య 58వేలు
ప్రస్తుతం విద్యార్థుల హాజరు 70 శాతం
ఉపాధ్యాయుల హాజరు 86 శాతం


