అక్రమ లేఅవుట్‌కు.. అనధికార వంతెన! | - | Sakshi
Sakshi News home page

అక్రమ లేఅవుట్‌కు.. అనధికార వంతెన!

Nov 2 2026 12:35 AM | Updated on Nov 2 2026 12:35 AM

● అనుమతి లేకుండానే నిర్మాణం ● ప్రేక్షకపాత్రలో బల్దియా, ఇరిగేషన్‌ యంత్రాంగం

కై లాస్‌నగర్‌: జిల్లాకేంద్రంలో రియల్‌ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. అక్రమంగా లేఅ వుట్‌ ఏర్పాటు చేయడమే కాకుండా అందులోకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న వాగుపై ఎలాంటి అనుమతులు లేకుండానే ఏకంగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దీ నిపై బల్దియా అధికారులకు ఫిర్యాదులు అందినా చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ బ్రిడ్జి నిర్మాణంతో భవిష్యత్తులో నీ టి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నట్లుగా కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

లేఅవుట్‌ ఏర్పాటు చేయాలంటే అధికారిక అనుమతులు తప్పనిసరి. అయితే అలాంటివేమి లేకుండా నే ఆదిలాబాద్‌లోని క్రాంతినగర్‌–భీంసరి పంచా యతీ పరిధిలో కొంతమంది రియల్‌ వ్యాపారులు క చ్చా లేఅవుట్‌ ఏర్పాటు చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండానే బండరాళ్లు పాతి ప్లాట్లుగా విభజించారు. అయితే ఇందులోకి వెళ్లాలంటే సరైన దారి లే దు. భీంసరి వాగు దాటి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలన్నా, ప్లాట్ల విక్రయాలు చేపట్టాలన్నా దారి తప్పనిసరి కావడంతో రి యల్‌ వ్యాపారులు కొత్త ఎత్తుగడ వేఽశారు. ఇందుకో సం వాగుపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. గతంలోనే పనులను చేపట్టి పిల్లర్ల వరకు నిర్మాణాలు జరగ్గా అప్ప ట్లో అధికారులు అడ్డుకోవడంతో నిలిపివేశారు. ప్రస్తుతం రాజకీయ అండదండలతో అనుమతులు లేకుండానే తిరిగి కొనసాగిస్తుండడం గమనార్హం.

నిబంధనలకు విరుద్ధంగా..

వాగులు, వంకలపై వంతెనలు నిర్మించాలంటే ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. గ్రామ పరిధిలోనైతే రెవెన్యూ, పట్టణ పరిధిలోనైతే మున్సిపల్‌ అనుమతి కూడా అవసరం.అయితే భీంసరి వాగుపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి ఏ ఒక్క శాఖ నుంచి కూడా అనుమతులు లేవు. వంతెన నిర్మాణం కోసం ఇరిగేషన్‌ అధికారులు ముందుగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి నీటి ప్రవాహం ఎలా సాగుతుంది, భవిష్యత్తులో వరద ఎక్కువైతే ఏ విధంగా ఎదుర్కొవాలనే అంశాలను పరిగణలోకి తీసుకుని అనుమతులిస్తారు. కానీ అలాంటిదేమి ఇక్కడ జరగలేదు. ఈ విషయమై కాలనీవాసుల నుంచి మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ అండదండలు ఉన్నందునే వారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నోటీసులు జారీ చేశాం

బ్రిడ్జి నిర్మాణం అక్రమంగా చేపడుతున్నారనే దానిపై ఫిర్యాదు అందింది. పనులను నిలిపివేయాలని ఇదివరకే నోటీసులను జారీ చేశాం. వాగుపై నిర్మాణం జరుగుతున్నందున ఇరిగేషన్‌ అధికారులకు కూడా సమాచారమందించాం. వారు కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. పనులను ఆపకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.

– నవీన్‌కుమార్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

మా దృష్టికి రాలేదు

వాగుపై అక్రమంగా వంతెన నిర్మిస్తున్నట్లుగా ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. అనుమతి లేకుండా వాగులపై వ్యక్తిగతంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్‌లైతే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.

– సాగర్‌, ఇరిగేషన్‌ శాఖ ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement