ఉద్యోగుల వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల వినూత్న నిరసన

Nov 2 2026 12:41 AM | Updated on Nov 2 2026 12:41 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగుల సమ్మె 20వ రోజుకు చేరింది. ఆదివారం ఉద్యోగులు చేతులపై గోరింటాకుతో డిమాండ్లు రాసుకుని వినూత్న నిరసన తెలిపారు. 20ఏళ్లుగా అంకితభావంతో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నా వేతనాలు పెంచడంలేదని ఆవేదన వ్యక్తంజేశారు. కుటుంబ పోషణ, పిల్ల ల చదువులు భారమై తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో దుర్భర జీవితం గడుపుతున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి రెగ్యులరైజ్‌ చేయాలని, వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, వార్షిక ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్‌, హెల్త్‌ కార్డులు అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement