జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల్లో కనీసం ఒక్కరు కూడా బాధిత కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదు. కేటీఆర్ మూడుసార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించి రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకొని అండగా నిలిచారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, రైతు భరోసా వంటి పథకాలన్నీ ఆపకుండా అమలు చేసి అండగా నిలిచారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులను ఆదుకోవాల్సింది పోయి పంటలు వేయవద్దని చెప్పడం సిగ్గుచేటు.
– కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే


