క్రీడాకారులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు సన్మానం

Nov 2 2026 12:41 AM | Updated on Nov 2 2026 12:41 AM

ఖానాపూర్‌: గిన్నిస్‌ ప్రపంచ రికార్డే లక్ష్యంగా నిర్వహించిన కరాటే కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఆరుగురు క్రీడాకారులు పాల్గొని ఒకేసారి చాప్స్‌ ప్రదర్శించడం అభినందనీయమని నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్‌ నాయక్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఆదివారం శాలువాలతో సన్మానించి బహుమతులు అందజేశారు. క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో మరిన్ని విజయాలు సాధించి గిన్నిస్‌ ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. అనంతరం కరాటే మాస్టర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో జాన్సన్‌ నాయక్‌నూ సన్మానించారు. క్రీడాకారులు తుర్క అశ్రీత్‌రెడ్డి, బత్తుల శశిర్‌, మైలారపు హనిత్య, మహ్మద్‌ ఇక్లసుద్దీన్‌, అప్షిన్‌ మైషా తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement