న్యూస్‌రీల్
నిర్మల్
గుస్సాడీ హోరు షురూ..
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే దండారీ ఉత్సవాలు ఉమ్మడి జిల్లాలో ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం గిరిజన పల్లెలు ఇప్పటికే ముస్తాబయ్యాయి.
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
లక్ష్మణచాంద: మండలంలోని పీచర గ్రామంలో పోచమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవాన్ని వీడీసీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తినెత్తుకుని ప్రధాన వీధుల గుండా డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ వినీత్, మాజీ సర్పంచులు లస్మన్న, భూమేశ్ తదితరులున్నారు.
ఊటకుంటలో చేపపిల్లలు వదులుతున్న డీఆర్డీవో, గ్రామస్తులు
వాన నీటిని ఒడిసిపట్టి..
వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు వ్యవసాయాన్ని వెంటాడుతున్న ప్రస్తుత తరుణంలో నీటివనరుల ప్రాధాన్యం మరింత పెరి గింది. వర్షాధారంగా పంటలు సాగుచేసే రైతులు చినుకు కోసం ఎదురుచూస్తుంటే.. అనంతపేట గ్రామంలో మాత్రం ఊటకుంట అందించిన నీటి భరోసాతో సాగు ముందుకు సాగుతోంది. వర్షపు నీటిని ఒడిసి పట్టిన ఊటకుంట దాదాపు 40–50మంది రైతులకు చెందిన 90–100ఎకరాలకు ఆసరా అవుతోంది. వరితో పాటు మక్క, పసుపు, జొన్న తదితర పంటలూ సాగుచేస్తున్నారు. తాజాగా ఈ ఊటకుంటలో చేపలు పెంచేందుకు డీఆర్డీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో చేపపిల్లలు వదిలారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు అనంతపేటకు చెందిన బొజ్జ గంగన్న. ఇక్కడ నిండుగా నీటిని పోస్తున్న ఈ బోరు రెండేళ్ల క్రితం దాదాపు ఎత్తిపోయే దశకు చేరుకుంది. చాలా తక్కువగా నీరు పోసేది. ఎప్పుడైతే ఊటకుంట నిర్మాణమైందో.. అప్పటి నుంచి ఇదిగో.. ఇలా నిండుగా నీరు పోస్తోంది. రెండుపంటలకూ సరిపడా నీరందిస్తోంది.


