breaking news
Trainee IPS Uday Krishna Reddy
-
ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్
-
ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు ఎన్ కౌంటర్ చేస్తానని సీపీ బెదిరించారు..!
-
ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు.. ఎన్ కౌంటర్ చేస్తానని సీపీ బెదిరించారు..!
-
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్: తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో అత్తాపూర్ పోలీసులు ఆయనను ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు హాలులోనే ఉదయ్ కృష్ణారెడ్డి బోరున విలపించారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై ఆయన మేజిస్ట్రేట్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో తనను సీపీ సజ్జనార్ తీవ్రంగా బెదిరించారని, ‘నిన్ను ఎన్కౌంటర్ చేస్తాం’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఉదయ్ ఆరోపించారు. న్యాయస్థానానికి సమర్పించిన ఫిర్యాదులో ఉదయ్ కృష్ణారెడ్డి పలు కీలక అంశాలను పేర్కొన్నారు. నన్ను సీసీ కెమెరాలు లేని చోటుకు తీసుకెళ్లి విచారించారు. టాస్క్‌ఫోర్స్ ఆఫీసులో ఉంచి తీవ్రంగా హింసించారు అని వాపోయారు. నిందితుడి ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన మేజిస్ట్రేట్.. సీసీ కెమెరాలు లేని చోట విచారణ ఎలా జరుపుతారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రెండు రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలంటూ అత్తాపూర్ ఇన్స్పెక్టర్కు కోర్టు షోకాజు నోటీసులు జారీ చేసింది -
చంచల్‌గూడ జైలుకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
సాక్షి,హైదరాబాద్: తోటి మహిళా ట్రైనీ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని భారీ భద్రత నడుమ చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు.తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని వేధించిన కేసులో అరెస్టయిన సస్పెండెడ్ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్, కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డికి, బాధితురాలికి మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఉదయ్ కృష్ణారెడ్డి క్రిమినల్ వేధింపులకు దిగాడు. బాధితురాలికి సంబంధించిన ప్రైవేట్ చాట్స్, ఫొటోలను సోషల్ మీడియాలో బయటపెడతానంటూ తీవ్రంగా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. నకిలీ అకౌంట్లతో కుటుంబసభ్యులు, సహచరులకు వేధింపులుబాధితురాలిని మానసికంగా వేధించడమే కాకుండా, ఉదయ్ కృష్ణారెడ్డి నకిలీ (ఫేక్) సోషల్ మీడియా అకౌంట్లను సృష్టించినట్లు దర్యాప్తులో తేలింది.ఈ నకిలీ ఖాతాల ద్వారా బాధితురాలి కుటుంబసభ్యులకు, ఆమెతో పాటు శిక్షణ పొందుతున్న సహచర అధికారులకు (బ్యాచ్‌మేట్స్) మెసేజ్‌లు పంపుతూ, తప్పుడు ప్రచారం చేస్తూ వేధించాడని డీసీపీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైన తర్వాత దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించాడు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలిసి పరారయ్యాడు. అయితే, నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు.. చివరకు ఆయనను ఆరంఘర్ చౌరస్తా వద్ద పక్కా ప్లాన్‌తో అదుపులోకి తీసుకున్నారు.ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన ఆత్మహత్య బెదిరింపులు, తీవ్ర మానసిక వేధింపుల కేసును షీటీమ్స్ డీసీపీ డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలను సేకరించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
సాక్షి,మిర్యాలగూడ: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. మిర్యాలగూడలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్‌లో నమోదైన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిని శారీరకంగా మానసికంగా వేధించాడని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంగళవారం మిర్యాలగూడలో అదుపులోకి తీసు హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. అనంతరం, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు. -
నాకు విలువలున్నాయి.. ఎక్కడికీ పారిపోలేదు: ఉదయ్‌కృష్ణారెడ్డి
సాక్షి, ప్రకాశం: హైదరాబాద్ పోలీస్ అకాడమీ ట్రైనీ ఐపీఎస్‌ల ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పరారీలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ట్రైనీ ఐపీఎస్(సస్పెండెడ్) ఉదయ్‌కృష్ణారెడ్డి ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్న ఆయన.. తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.‘‘మా నాన్నమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్వస్థలం ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం వచ్చా. కేసు కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల పూర్తి వివరాలు వెల్లడించలేను. త్వరలోనే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా’’ అని మంగళవారం ఉదయ్‌కృష్ణారెడ్డి ఓ మీడియా చానెల్‌తో మాట్లాడారు. నాకు విలువలున్నాయితాను పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తినని, విలువలకు కట్టుబడి జీవిస్తున్నానని ఉదయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. పోలీస్, న్యాయ వ్యవస్థలపై తనకు నమ్మకం ఉందని, విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.నోటీసులు అందలేదుపోలీసులు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని తన రెండు చిరునామాలకు వెళ్లారన్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. ఆ రెండు చిరునామాలు తాత్కాలికమైనవని, తన శాశ్వత చిరునామా అయిన ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. తాను స్వయంగా హైదరాబాద్‌కు వెళ్తున్నానని, ఎక్కడికీ పారిపోలేదని మరోసారి స్పష్టం చేశారు.తోటి ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిపై తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి సంచలన ఆరోపణలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు అయ్యింది. ఆ వెంటనే దర్యాప్తు నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అటుపై ఆరోపణలు తట్టుకోలేక ఉదయ్ ఆస్పత్రి పాలయ్యారు కూడా. అయితే ఈ ఆరోపణలపై ఉదయ్‌కృష్ణారెడ్డి తాజాగా వివరణ ఇచ్చారు.తనపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన ప్రక్రియను గౌరవిస్తానని ఉదయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, చివరికి నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
ట్రైనీ IPS ఉదయ్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ కేసు నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన సందర్భంగా లైంగిక వేధింపుల ఆరోపణలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.ఇదిలా ఉంటే, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. తదుపరి తీర్పును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.మరోవైపు, ఈ కేసు దర్యాప్తులో భాగంగా డీసీపీ లావణ్య నాయక్ పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. అక్కడ బాధితురాలైన మహిళా ట్రైనీ ఐపీఎస్ నుంచి డీసీపీ లావణ్య నాయక్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. -
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్!
సాక్షి,హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం.ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే, ఆత్మహత్యాయత్నానికి ముందు ట్రైనీ ఐపీఎస్ రాసిన సూసైడ్ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి తనపై చేసిన లైంగిక వేధింపులు పూర్తిగా అవాస్తవమని ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.తాను సదరు బ్యాచ్‌మేట్ (కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్)తో గత ఏడాది కాలంగా రిలేషన్లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఆమెకు వివాహమైన తర్వాత కూడా తమ ఇద్దరి మధ్య ఈ బంధం కొనసాగిందని వెల్లడించారు. ఈ క్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిణే స్వయంగా తన గది వద్దకు వచ్చి తలుపు తీయమని గొడవ చేసిందని, దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు తన మొబైల్ ఫోన్లో ఉన్నాయని వివరించారు.వారి మధ్య ఉన్న రిలేషన్, వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్తకు కూడా వివరించినట్లు పేర్కొన్నారు. ఈ సంభాషణలు, చాటింగ్‌లు, వీడియోల తాలూకు అన్ని రకాల నిరూపణలు తన ఫోన్లోనే భద్రంగా ఉన్నాయని, వాటిని పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయని లేఖలో వెల్లడించారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసును సరికొత్త కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


