breaking news
sathya sai baba birth anniversary
-
సత్యసాయి సమాజాన్ని మానవత్వం వైపు నడిపారు
ప్రశాంతి నిలయం: సత్యసాయి మానవతా విలువల బోధనతోపాటు నిస్వార్థసేవలతో సమాజాన్ని మానవత్వం వైపు నడిపారని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గుర్తు చేశారు. ఆయన భౌతికంగా లేకపోయినా బాబా సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మానవతా వాదులు, భక్తులందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పుట్టపర్తిలోని సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో సత్యసాయి శతవర్ష జయంతి వేడుకలు ఆదివారం అశేష భక్తుల నడుమ విశ్వవేడుకలా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ సత్యసాయి బాబా అహింస, ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపంగా నిలిచారన్నారు. తన చిన్నతనంలో తమిళం మాత్రమే మాట్లాడే తన అత్త సుదూరంలో ఉండే పుట్టపర్తికి వచ్చి 15రోజులు ఇక్కడే నుండి సత్యసాయి ఆశీర్వాదాలు పొందడం బాబా దైవిక శక్తికి నిదర్శనమని చిన్ననాటి అనుభవాన్ని స్మరించుకున్నారు.‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్’ అన్న సత్యసాయి నినాదాలు కోట్లాది గుండెలను కదిలించాయన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలు కోట్లాది మంది ప్రజలకు జీవనాడిగా ఉన్నాయన్నారు. ప్రపంచం ఘర్షణలు, ఒత్తిడితో నిండిన పరిస్థితులలో సత్యసాయి చూపిన మార్గం వాటికి పరిష్కారం చూపగలదన్నారు. ఆధ్యాత్మిక, సేవాస్ఫూర్తి సత్యసాయి నేటి తరానికి ఇచి్చన వారసత్వం అన్నారు. రాబోయే తరానికి బాబా వారసత్వాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిçÜ్తూ అందించాలని పిలుపునిచ్చారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు మాట్లాడుతూ.. సత్యసాయి సంకల్ప బలం కుగ్రామం పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చిందన్నారు.సత్యసాయి నిరాడంబరతతో మానవాళికి నిస్వార్థ సేవలు అందించి ప్రేమ మూర్తిగా, సేవా స్ఫూర్తిగా కోట్లాది మంది భక్తులను సేవామార్గం వైపు నడిపారన్నారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. బాబా మానవాళి శ్రేయస్సు కోసం ఏడు దశాబ్దాల క్రితం స్థాపించిన సత్యసాయి ట్రస్ట్ ప్రపంచవ్యాప్త సేవా ఉద్యమంగా మారిందని, ఇది సత్యసాయి సంకల్ప బలానికి నిదర్శనమని అన్నారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాలలో సత్యసాయి అందించిన సేవలు ఎంతో గొప్పవన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సత్యసాయి అవతార పురుషుడన్నారు. మానవతా విలువలను, ఆధ్యాత్మిక చింతనను బోధిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖించారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడం నేటి తరం బాధ్యత అన్నారు. కనుల పండువగా స్వర్ణ రథోత్సవం ఆదివారం ఉదయం 9 గంటలకు సత్యసాయి స్వర్ణ రథోత్సవం కనుల పండువగా సాగింది. దేశం నలుమూలల నుంచి తరలివచి్చన సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు, భక్తులు ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సత్యసాయి బోధనలు, సూక్తుల ప్లకార్డులను చేతబూని, నృత్య ప్రదర్శనలతో ముందు సాగగా.. ఆ వెనుక సత్యసాయి స్వర్ణ రథం కదిలింది. ‘కదిలింది.. కదిలింది సాయి రథం.. స్వర్ణరథం’ అంటూ ప్రముఖ గాయకుడు మను గానానికి అనువుగా భక్తులు ఆనంద డోలికల్లో తేలుతూ రథోత్సవాన్ని సాగించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల బాలవికాస్ చిన్నారులు మానవతా విలువలను చాటుతూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మైమరపించాయి. సాయంత్రం సత్యసాయి జోలోత్సవం నిర్వహించారు.ప్రజల్లో దేవుడిని చూసిన మహానుభావుడు: సీఎం రేవంత్సత్యసాయి ప్రజల్లో దేవుడిని చూస్తూ మానవసేవే మాధవ సేవ అని నిరూపించిన మహానుభావుడని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బాబా తన ప్రేమతో మనుషుల్ని గెలిచారని, ప్రేమతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారని చెప్పారు. ‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను సత్యసాయి చేసి చూపించి తన సంకల్ప బలాన్ని చాటుకున్నారు. పేదలకు ఉచిత వైద్యం లాంటి తన సేవలతో దేవుడిగా పూజింపబడుతున్నారు.గతంలో పాలమూరు జిల్లాలో బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి కల్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తమిళనాడు, కర్ణాటకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లో బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. ఆయన మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి మనందరిలో ఉంది. మనతో పాటు ప్రపంచంలోని కోట్లాది మంది జీవితాలలో బాబా స్ఫూర్తి నింపారు. తెలంగాణలోనూ ఉత్సవాలు సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు రావడం ఈ నేల పవిత్రతను తెలియజేస్తోంది. బాబా సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించాం. తెలంగాణలో బాబా సేవలను విస్తృతం చేసేందుకు మా ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించిన మహనీయుడు సత్యసాయి
-
సత్య సాయి సేవలో విఖ్యాత వ్యాపారవేత్తలు
తన ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక భక్తులను సంపాదించుకున్న సత్య సాయిబాబా (Sri Sathya Sai Baba) ముఖ్యంగా సేవా కార్యక్రమాల ద్వారా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రంగాలలోనూ సత్య సాయిబాబా భక్తులు ఉన్నారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన ఎందరో ప్రముఖలు, పారిశ్రామికవేత్తలూ ఆయన సేవలో తరించారు. సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా వారిలో కొందరి గురించి..ర్యుకో హిరా: జపాన్‌కు చెందిన హెచ్ఎంఐ హోటల్ గ్రూప్ వ్యవస్థాపకులు. ప్రముఖ అంతర్జాతీయ సాయి భక్తులలో ఒకరు. ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ దాత ఈయనే. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ధర్మకర్తగా కూడా ఉన్నారు.రతన్ టాటా: టాటా సన్స్ దివంగత చైర్మన్. సాయిబాబా కార్యక్రమాలకు హాజరై ఆయన పట్ల గౌరవప్రదమైన ఆధ్యాత్మిక అభిమానాన్ని కొనసాగించారు. శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమ రూపకల్పనకు సహాయ సహకారాలందించారు.ఇందులాల్ షా: చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఈయన వ్యాపార వర్గాలలో ప్రముఖుడిగా పేరు గాంచారు. సాయి సంస్థల ప్రపంచ విస్తరణలో కీలక పాత్ర పోషించారు.ఏవీఎస్ రాజు: పారిశ్రామికవేత్త, ఎన్సీపీ (నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ) వ్యవస్థాపకుడు. సాయిబాబాకు అత్యంత భక్తుడు. సాయిబాబాపై అనేక పుస్తకాలు రాశారు.మనోహర్ శెట్టి: ఆతిథ్య, మౌలిక సదుపాయాల రంగంలో వ్యాపారవేత్త. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. పుట్టపర్తిలో అనేక సేవ, నిర్మాణ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.వేణు శ్రీనివాసన్: టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్. బాబా దీర్ఘకాల భక్తుడు. సాయిబాబాతో తన ఆధ్యాత్మిక అనుభవాల గురించి పలుసార్లు పంచుకున్నారు. అనేక సాయి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.లియో ముత్తు: లియో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (తమిళనాడు) వ్యవస్థాపకుడు. సాయి బోధనల ప్రభావానికి గురై ఆయనకు భక్తుడిగా మారారు.క్రిస్ గోపాలకృష్ణన్: యాక్సిలార్ వెంచర్స్ చైర్మన్. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈయన సత్యసాయి ఆరాధకుడిగా పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. -
సేవకు ప్రతిరూపం... ఆధ్యాత్మిక కెరటం
సత్యసాయిబాబా తన జీవన ప్రస్థానంలో సత్య ధర్మ శాంతి ప్రేమలనే విలువలను బోధిస్తూ, మానవాళిని విలువైన జీవన మార్గం వైపు పయనింపజేశారు. ఆధ్యాత్మిక బోధనలతో అజ్ఞానాంధకారాన్ని పారదోలుతూ భక్త కోటిలో చైతన్యకాంతులు నింపారు. ప్రేమను పంచే ప్రేమమూర్తిగా, సేవకు ప్రతి రూపంగా; ఉచితంగా తాగునీరు, విద్య, వైద్య సేవలను అందించి సేవాప్రదాతగా కీర్తి గడించారు. పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆపదలో భక్తులను ఆదుకునే ఆపద్బాంధవుడిగా, ఆరాధ్య దైవంగా భక్తుల మదిలో గూడుకట్టుకున్న సత్యసాయి నిర్యాణం చెంది పద్నాలుగేళ్లు పూర్తవుతున్నా, భక్తులు మాత్రం ఆయననే తమ శ్వాసగా, ధ్యాసగా కొలుస్తున్నారు. సత్యసాయి జయంతిని ఎంతో పవిత్రంగా భావించే భక్తులు పుట్టపర్తిలో జరుగుతున్న జయంతి వేడుకలకు తరలి వచ్చి భక్త నీరాజనాలు అర్పిస్తున్నారు.కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని అప్పటి కుగ్రామమైన పుట్టపర్తిలో 1926 నవంబర్ 23న ఈశ్వరాంబ, పెద్ద వెంకమరాజు దంపతులకు సత్యసాయి జన్మించారు. బాల్యం నుంచి ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉన్న సత్యసాయి, తన 14 వ ఏట తాను సత్యసాయి బాబాను, భూమిపై ధర్మ పరిరక్షణకు అవతరించినట్లు ప్రకటించుకున్నారు. నాటి నుంచి పుట్టపర్తిలో మందిరం ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక బోధనలు వినిపిస్తూ, తనను ఆరాధించే భక్తులను దగ్గరకు చేర్చుకున్నారు.మానవ సేవయే మాధవ సేవ అని బోధించిన సత్యసాయి, ఒక వైపు ఆధ్యాత్మిక బోధనలతో మానవాళిని చైతన్యవంతులను చేస్తూనే, కనీస అవసరాలకు నోచుకోని బడుగు జీవులకు సేవలందించే మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1972లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి విద్య, వైద్యం, తాగునీరు ఉచితంగా అందించే కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రకృతి విపత్తులు సంభవించే సమయాల్లో తన సేవాదళ్ విభాగాల ద్వారా బాధితులకు సేవలు అందిస్తున్నారు.కేజీ నుంచి పీజీ వరకువిద్య మనిషిని అవివేకం నుంచి వివేకవంతుణ్ణి చేస్తుందని విశ్వసించిన సత్యసాయిబాబా.. పుట్టపర్తి కేంద్రంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా మానవతా విలువలతో కూడిన విద్యను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ యూనివర్శిటీని (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) ఏర్పాటు చేశారు. పుట్టపర్తి, నందిగిరి, అనంతపురం, బెంగళూరు సమీపాన బృందావనం వద్ద నాలుగు క్యాంపస్‌లు నిర్వహిస్తున్నారు. అనంతపురం క్యాంపస్ ద్వారా మహిళా విద్యను ప్రోత్సహిస్తున్నారు.ప్రతి ఏటా సుమారు పదివేల మందికి పైగా విద్యార్థులు సత్యసాయి విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్యను పొందుతున్నారు. దేశీయంగా గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాలలో విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో 2010లో విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశీయంగా 126 పాఠశాలలు ఈ పథకం ద్వారా విద్యను అందిస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా విద్యను పొందిన ఎందరో విద్యార్థులు నేడు ఉన్నత స్థానాలలో సేవలు అందిస్తున్నారు.పైసా ఖర్చు లేకుండా‘వైద్యో నారాయణ హరి’ అనే నానుడిని సాకారం చేస్తూ సత్యసాయి ఉచిత వైద్యసేవకు ప్రాధాన్యం ఇచ్చారు. పుట్టపర్తి ప్రాంతంలో పేదలు వైద్యం అందక బాధలు పడుతున్నారని, ఒక ఆసుపత్రి నిర్మించాలని తల్లి ఈశ్వరాంబæకోరగా, తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి పుట్టపర్తిలో 1956లో పుట్టపర్తి నడిబొడ్డున 30 పడకల జనరల్ ఆసుపత్రి నిర్మించారు. తర్వాత 1991లో ఆధునిక వసతులతో కూడిన శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించారు. ఈ ఆసుపత్రుల ద్వారా రోగులు ఉచితంగా ఖరీదైన వైద్యసేవలు పొందుతున్నారు.ఉచిత తాగునీటి సరఫరానిత్యం కరవుతో అల్లాడే రాయలసీమలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. రాయలసీమ ప్రజల కష్టాలను చూసి చలించిన సత్యసాయి 1995 నవంబర్‌లో రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు సత్యసాయి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 1,400 గ్రామాలు ఈ పథకం ద్వారా తాగునీటిని పొందుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి కూడా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కండలేరు నుంచి ‘సత్యసాయి తాగునీరు’ సరఫరా అవుతోంది. ప్రతిరోజూ సుమారు 20 లక్షల మంది సత్యసాయి తాగునీటి పథకం వినియోగించుకుంటున్నారంటే.. సాయి సంకల్పం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. -
శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా అతున్యత వైద్య సేవలు
వైద్యులు త్యాగ స్ఫూర్తితో పేదలకు సేవ చేయాలి. దీనికంటే గొప్ప సేవ మరొకటి లేదు. దిక్కులేని వారికి, నిస్సహాయులకు దేవుడే ఏకైక ఆశ్రయం. మానవుడు దేవుని స్వరూపం కాబట్టి, దిక్కులేని వారికి, నిస్సహాయులకు సహాయం చేయడం అతని ప్రాథమిక కర్తవ్యం. – శ్రీ సత్యసాయి బాబా‘సేవే సత్యసాధన’ అనే సూత్రంతో, సమాజంలో ఆర్థిక, సామాజిక స్థాయులకు అతీతంగా అందరికీ ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విస్తృతంగా కృషి చేస్తోంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, మానవాళి సేవలో అగ్రగామిగా నిలిచిన ఒక పుణ్య సంస్థ. ‘ప్రేమతో చేసే సేవే నిజమైన సేవ’ అనే సూత్రాన్ని ఆచరణలో అమలు చేస్తూ, ఈ ట్రస్ట్ సమాజంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం లేకుండా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది.శ్రీ సత్యసాయి మెడికల్ మిషన్ లక్ష్యాలుపేద ప్రజల ఇంటి ముంగిటకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను సాధించడం.ఆరోగ్యం – పరిశుభ్రతతో సహా నివారణ ఆరోగ్య సంరక్షణపై ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ల ద్వారా అనారోగ్యానికి దూరంగా ఎలా ఉండాలో ప్రజలకు అవగాహన కల్పించడం.ఆరోగ్య సంరక్షణ అమలులో అనుసరించే సూత్రాలు :శ్రీ సత్యసాయి బాబా అమలు చేసిన ఆరోగ్య సంరక్షణకు ఈ కింది ఆరు సూత్రాలే మార్గదర్శకాలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆరోగ్య సంరక్షణ సంస్థల కార్యకలాపాలలో శ్రద్ధగా అనుసరిస్తారు. అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ ఉచిత ఆరోగ్య సంరక్షణ కారుణ్య ఆరోగ్య సంరక్షణ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సకాలంలో ఆరోగ్య సంరక్షణ అందించడం వైద్యుడికి, రోగికి మధ్య హృదయపూర్వక, ప్రేమపూర్వక సంబంధాన్ని పెంపొందించడమే వైద్యసేవల ఉద్దేశం. శ్రీ సత్యసాయి మెడికల్ మిషన్ సమగ్ర ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్సలను క్రమం తప్పకుండా అందించడం ద్వారా ఈ అంశాన్ని వివరిస్తుంది. శ్రీ సత్యసాయి ఆసుపత్రులలోని సంరక్షణలో మానవీయ అంశ స్పష్టంగా కనిపిస్తుంది.శ్రీ సత్యసాయి హెల్త్ కేర్ త్రికోణ విధానంశ్రీ సత్యసాయి హెల్త్ కేర్ ఒక సమగ్ర విధానాన్ని కలిగి ఉంది, ఇది కింది మూడు కోణాల విధానం ద్వారా అమలవుతోంది. నివారణ కార్యాచరణ, నివారణ దృష్టి, ఆధ్యాత్మిక స్థావరం వ్యక్తిగత స్థాయి, కుటుంబ స్థాయి, సమాజ స్థాయి వంటి అన్ని స్థాయులలోను ఆరోగ్య విద్యకు సత్యసాయి ఆసుపత్రులు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. అలాగే, అన్ని స్థాయులలోనూ స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అసంఖ్యాక రోగులకు శ్రీ సత్యసాయి సేవా మెడికల్ మిషన్ ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ సంస్థ అందించే వైద్యసేవలు ఇవీ:వివిధ రాష్ట్రాలలో నిర్వహించే వైద్య శిబిరాలు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకల సందర్భంగా వైద్య శిబిరాలు, స్పెషాలిటీ శిబిరాలు, గ్రామ సేవలో భాగంగా శిబిరాలు, శ్రీసత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌తో వైద్య కార్యకలాపాల ఏకీకరణ, వ్యక్తిగత వైద్యుల క్లినిక్‌లు, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద చికిత్స కేంద్రాలు కూడా ఇందులో భాగంగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు శ్రీ సత్యసాయి మొబైల్ హెల్త్ సర్వీసెస్, టెలీ–మెడిసిన్ సేవలు, రక్తదాన శిబిరాలు (లిక్విడ్ లవ్ డొనేషన్ శిబిరాలు), సాయి పునరావాస కార్యక్రమాలు, పోషకాహార లోపం నిర్మూలన, విపత్తు నిర్వహణ తదితర సేవలను అందించడంలో ముందంజలో ఉంటున్నాయి.నివారణ ఆరోగ్య సంరక్షణ శ్రీ సత్యసాయి మొబైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ చికిత్సలో భాగంగా వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రివెంటివ్ మెడిసిన్‌పై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత వంటి ప్రాథమిక ఆరోగ్య విధానాలపై గ్రామస్థులలో అవగాహన కల్పించడానికి నిపుణులతో ప్రసంగాలు, ప్రదర్శనలు, వీడియో ప్రదర్శనలు నిర్వహిస్తారు. మద్యపానం, ధూమపానం, పొగాకు నమలడం వంటి దురలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలపై కూడా వారికి అవగాహన కల్పిస్తారు.జనరల్ హాస్పిటల్స్ గ్రామీణ వైద్య సేవలుపుట్టపర్తిలో 1956లో స్థాపించిన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్, 1976లో ప్రారంభమైన వైట్‌ఫీల్డ్ జనరల్ హాస్పిటల్, మహిళలు, పిల్లలు, వృద్ధులు, గ్రామీణ ప్రజలకు సాధారణ చికిత్సల నుంచి ప్రసూతి సేవల దాకా అన్ని వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. అలాగే, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మొబైల్ ఆసుపత్రులు దూర గ్రామాలకు చేరుకుని అక్కడ ప్రజలకు వైద్యపరీక్షలు, మందులు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉచిత వైద్యానికి ప్రతీకలు1991 నవంబర్ 22న భగవాన్ బాబా చేత శ్రీ సత్యసాయి ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ – పుట్టపర్తి ప్రారంభించబడింది.ఈ ఆసుపత్రి గుండె, మూత్రపిండాలు, న్యూరో, యూరాలజీ వంటి క్లిష్టమైన వ్యాధులపై అత్యాధునిక శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తుంది.ఆ తర్వాత 2001లో బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాపించబడింది. అక్కడ కూడా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, కేర్ యూనిట్లు ప్రపంచస్థాయి సదుపాయాలతో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.ఈ రెండు ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు లక్షలాది మంది రోగులు ఉచితంగా చికిత్స పొందారు. ప్రతి రోగికి బాబా ఆశీర్వాదం, వైద్యుల సేవానిరతి కలసిన మానవతా వాతావరణం అక్కడ ప్రతి మూలలోనూ కనిపిస్తుంది.ఉచిత వైద్య శిబిరాలుభగవాన్ నిస్వార్థ సేవకు ఉదాహరణగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ తోటి మానవులకు సేవ చేయడానికి ప్రేరణ కల్పించారు. భారతదేశంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వైద్యసంరక్షణ అందుబాటులో లేని ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్యం, పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. భగవాన్ ప్రేమ, ఆశీస్సులతో ఈ సంస్థల సేవకులు నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టిస్తున్నారు. ఆరోగ్యప్రచారం, విద్య, శస్త్రచికిత్సలు, ఆరోగ్య సంరక్షణ సహా అన్నిరకాల ఆరోగ్యసేవలను నిర్వహించడానికి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ రోగులకు ఉచితంగా మందులు ఇస్తున్నారు. లక్షలాది మంది రోగులకు కంటి వ్యాధులకు చికిత్స, వేలాది మందికి కంటిశుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన వివిధ సమితిలు వివిధ ప్రాంతాలలో ఉచిత వైద్యకేంద్రాలను నిర్వహిస్తున్నాయి.భగవాన్ జన్మదిన వేడుకల సందర్భంగా వైద్య శిబిరాలుప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా వేలాది మంది రోగులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు అందిస్తారు. ఈ శిబిరాలకు రోగ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారిలో ఎవరికైనా అధునాతన చికిత్స అవసరమైతే, వారిని శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రికి పంపుతారు.ప్రశాంతి నిలయం లేదా ప్రశాంతిగ్రామ్‌లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ పురోగతిని సమీక్షించడానికి, శ్రీ సత్యసాయిబాబా బోధనలను గుర్తు చేసుకోవడానికి వైద్య శిబిరంలోని ప్రతి ఒక్కరితో రోజూ సాయంత్రం సత్సంగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లోనూ స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా మారుమూల గ్రామాలకు వైద్య సేవలను విస్తరించడానికి ఎంపిక చేసిన గ్రామాల్లో దాదాపు పది రోజులు మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. సాధారణ శస్త్రచికిత్సలు, కంటిశుక్లం రోగులను సమీప పట్టణాలకు తీసుకువచ్చి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయిస్తారు.శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్స్శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ అనేది మరొక ప్రత్యేకమైన ఉచిత గ్రామీణ ఆరోగ్యసేవ. శ్రీ సత్యసాయి బాబా ఈ సేవలను 2006 మార్చి 3న ప్రారంభించారు. వారానికి ఒకసారి శ్రీ సత్యసాయి ఉచిత వైద్య క్లినిక్‌లను అనేక సమితిలు నిర్వహిస్తున్నాయి.టెలీమెడిసిన్టెలీమెడిసిన్ కేంద్రాలు నేరుగా వైద్య చికిత్సలను అందించవు. రోగులు ఎవరైనా వీటిని సంప్రదిస్తే, వారికి తగిన ఆసుపత్రులను సూచించడం, అక్కడ లభించే చికిత్స వివరాలను తెలియజేయడం సహా అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి.వివిధ సంస్థలలో వైద్య పరీక్షలువివిధ రాష్ట్రాలకు చెందిన శ్రీ సత్యసాయి సంస్థల వైద్య బృందాలు అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, కుష్టు వ్యాధిగ్రస్థుల నివాసాలు తదితర ప్రదేశాలను తరచు సందర్శించి, అక్కడి వారికి అవసరమైన వైద్య సేవలను అందిస్తాయి. సాధారణ వైద్య శిబిరాలతో పాటు స్థానిక గ్రామీణ పాఠశాలల విద్యార్థులకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆరోగ్య సేవలతో పాటు వ్యక్తిగత సంరక్షణ, ఉద్యోగ సంరక్షణ, విద్యా సంరక్షణ, ఆధ్యాత్మిక సంరక్షణ, వ్యవసాయ సంరక్షణ, సామాజిక సంరక్షణ వంటి సేవలన్నీ శ్రీ సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌తో అనుసంధానమై పనిచేస్తుంటాయి.సేవకు ప్రతీక సత్యసాయి వైద్య మిషన్సత్యసాయి ట్రస్ట్ వైద్య సేవలు కేవలం రోగాన్ని నయం చేయడమే కాదు, ప్రేమతో, కరుణతో రోగికి మానసిక బలాన్ని కూడా అందిస్తున్నాయి. ఇందులో పనిచేసే వైద్యు లందరూ సేవా భావంతో పనిచేస్తున్నారు. కుల మత ఆర్థిక వ్యత్యాసాలకు తావు లేకుండా, ప్రతి ఒక్కరూ భగవాన్ బాబా సూత్రం ప్రకారం ‘మానవుడు దేవుని రూపం’ అనే దృష్టితోనే సేవలను అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆరోగ్య సేవలు ప్రపంచానికి మానవతా దృక్పథానికి ఆదర్శం.‘ప్రేమలోనే వైద్యం ఉంది, సేవలోనే దేవుడు ఉన్నాడు’ అనే బాబా వాక్యం ఈ సంస్థ ప్రతి పనిలోనూ ప్రతిఫలిస్తుంది. భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులతో ఈ సేవాయజ్ఞం శతాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షిద్దాం.మారుమూల ప్రాంతాలకూ విస్తరణశ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. పుట్టపర్తి, బెంగళూరులోని వైట్ఫీల్డ్లలోని శ్రీ సత్యసాయి జనరల్ ఆస్పత్రులు 2023–24 నాటికి దాదాపు 4.3 లక్షల మంది ఔట్‌పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు సుమారు 38 వేల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాయి. శ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల ఉన్న లద్దాఖ్ సహా ఇతర హిమాలయ ప్రాంతాలలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాయి. అలాగే, ప్రసూతి సేవలు, హృద్రోగాలు, మధుమేహం, శిశువైద్యం, దంత చికిత్సలు, మానసిక చికిత్సలు తదితర రంగాలకు చెందిన ప్రత్యేక క్లినిక్‌లను కూడా నిర్వహిస్తున్నాయి. వైద్య చికిత్సల ఖర్చు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా ఉన్నతస్థాయి వైద్య సేవలను అందిస్తుండటం విశేషం.మారుమూల ప్రాంతాలకూ విస్తరణశ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. పుట్టపర్తి, బెంగళూరులోని వైట్ఫీల్డ్లలోని శ్రీ సత్యసాయి జనరల్ ఆస్పత్రులు 2023–24 నాటికి దాదాపు 4.3 లక్షల మంది ఔట్‌పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు సుమారు 38 వేల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాయి. శ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల ఉన్న లద్దాఖ్ సహా ఇతర హిమాలయ ప్రాంతాలలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాయి. అలాగే, ప్రసూతి సేవలు, హృద్రోగాలు, మధుమేహం, శిశువైద్యం, దంత చికిత్సలు, మానసిక చికిత్సలు తదితర రంగాలకు చెందిన ప్రత్యేక క్లినిక్‌లను కూడా నిర్వహిస్తున్నాయి. వైద్య చికిత్సల ఖర్చు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా ఉన్నతస్థాయి వైద్య సేవలను అందిస్తుండటం విశేషం. -
ప్రేమ, సేవే లక్ష్యంగా శ్రీ సత్యసాయి బాబా జీవితం
కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 1926 నవంబరు 23న జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు. బాబా జన్మించిన గొల్లపల్లి– ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. భక్తులకు షిరిడీ సాయిబాబా అవతార పురుషుడిగా తనను తాను చెప్పుకొన్నారు. షిరిడీ సాయిబాబా మరణించిన ఎనిమిదేళ్లకు బాబా జన్మించారు. సాయిబాబా జీవితంలో ఎన్ని వివాదాలు వచ్చినా, ఆయన సేవలను మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేకపోయారు. బాబా బంగారు ఉంగరాలు, విబూది సృష్టించి భక్తులకు కానుకలుగా ఇచ్చేవారు. కోట్లాదిమంది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. కుల మతాలకు అతీతంగా నిలిచారు.సత్యసాయి భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. సత్యసాయి బాబా బాల్యంలోనే చాలా అద్భుతాలు చేశాడని చెబుతారు. చిన్న వయసులోనే అపర మేధావిగా, సేవాభావం గల వ్యక్తిగా ముద్రపడ్డారు. అపర మేధావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులకు వినిపించేవారు.1940 మే 23న తండ్రి ‘నీవెవరు?’ అని అడిగినప్పుడు ‘నేను సాయిబాబా’ను అని సమాధానం చెప్పారు. నిదర్శనం చూపమంటే చేతిలో గుప్పెడు మల్లెపూలను తీసుకుని నేలపైకి విసరగా అవి ‘సాయిబాబా’ అనే అక్షరాలుగా ఏర్పడా›్డయి. ఆ చర్యతో బాబా తండ్రి– బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడిగా భావించారు. అప్పుడు బాబా తాను షిరిడీ సాయిబాబా ప్రతిరూపాన్ని అని చెప్పారు. తాను షిరిడీ సాయికి ప్రతిరూపాన్ని అని, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో భక్తులు రావడం ప్రారంభమైంది.1944లో భక్తులు, బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరం నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభమైన ప్రశాంతి నిలయం 1950 నాటికి పూర్తయింది. 1957 సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారతదేశ దేవాలయాల సందర్శనకు వెళ్లారు. 1956లో చిన్నపాటి జనరల్ హాస్పిటల్‌ను పుట్టపర్తిలో నిర్మించారు. 1968లో బొంబాయిలో ధర్మక్షేత్ర అనే ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1968 జూన్ 29న బాబా మొదటిసారి విదేశాలకు వెళ్లారు. అక్కడ బాబా తాను ఏ మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదని, ప్రేమను పంచడానికి వచ్చానని భక్తులకు చెప్పారు. తన వైపు ఎవరినీ తిప్పుకోవాలని రాలేదని, ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. 1973లో హైదరాబాద్‌లో శివం మందిరాన్ని ప్రారంభించారు.అనంతరం 1981 జనవరి 19న చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించారు. 1991లో పుట్టపర్తిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మంచారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2001లో మరొకసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను బెంగళూరులో నిర్మించారు. 1965లో సత్యసాయిబాబా భారతదేశంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలను స్థాపించారు. దీని ద్వారా కుల మతాలకు అతీతంగా ప్రజలు సమష్టిగా నిస్వార్థ సేవలో పాల్గొని, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే శాశ్వత విలువలను పెంపొందించు కోవాలని సూచించారు. ఆయన ప్రసంగంలో లవ్ ఆల్.. సర్వ్ ఆల్ (అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు), హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్ (అందరికీ మంచి చేయి.. ఎవరికీ హాని చేయకు) అనే పదాలు ప్రతిసారీ వినిపించేవి. పుట్టపర్తిలో ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం ప్రశాంతి నిలయం కేంద్రంగా మొదలైన ఉద్యమం.. ప్రపంచవ్యాప్తంగా 156 దేశాలకు పైగా విస్తరించింది.ఉచితంగా విద్య, వైద్యంనిరంతరం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 1972లో ‘శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్’ స్థాపించారు. అప్పటి నుంచి ఆ సంస్థలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇప్పటికీ అమలులో ఉంది. అదేవిధంగా ఖరీదైన వైద్యం ఉచితంగానే చేస్తున్నారు. కోట్లాది మంది ఉచిత వైద్యాన్ని పొందారు. ప్రేమ, సేవ, సార్వత్రిక సోదరభావంతో సమాజానికి నిత్యం కొత్త నమూనాలను తీసుకొస్తున్నారు. ఇక్కడ చదివిన ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అవతార పురుషుడిగా ప్రకటించుకున్న నాటి నుంచి 86 ఏళ్ల వరకు సేవకుడిగానే నిలిచారు. బాబా భౌతికంగా లేకపోయినా, ఆయన పాటించిన, ప్రారంభించిన విధానాలు నేటికీ కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి అనే పదం శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. -
నూతన ఆవిష్కరణలతోనే పేదరిక నిర్మూలన
ప్రశాంతి నిలయం: సాంకేతిక విజ్ఞానం ద్వారా నూతన ఆవిష్కరణలతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ సభా మందిరంలో గురువారం సత్యసాయి శతజయంతి వేడుకలలో భాగంగా సత్యసాయి సేవాసంస్థల 11వ జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజౖరెన గడ్కరీ మాట్లాడుతూ.. సత్యసాయి బాబా ఆధ్యాత్మిక బోధనలు, సేవా కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చారన్నారు. తాను ఇక్కడి భక్తిభావనను, విలువలను, సేవా భావాన్ని చూసి ప్రేరణ పొంది తదుపరి జీవితంలో మరింత మంచి చేయాలనే తపనతోనే వచ్చానని చెప్పారు.ప్రతి మనిషిలో సత్ప్రవర్తన, మంచి సాంగత్యం, ఉన్నత విద్యాగుణం ఉత్తముడిలా తీర్చిదిద్దుతాయన్నారు. ఎదుటి వ్యక్తి అవసరాలను గుర్తించి చేతనైన సాయం చేసే గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. సత్యసాయిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు నడిపే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలతో కూడిన పుస్తకాన్ని సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు విడుదల చేశారు. అంతకుముందు గడ్కరీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)
-
సాయి మార్గంలో నడుద్దాం..: ప్రధాని మోదీ పిలుపు
సాక్షి, పుట్టపర్తి: ‘భగవాన్ శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఈ తరానికి ఒక వేడుక మాత్రమే కాదు.. దైవ ఆశీర్వాదం. భౌతికంగా మనతో లేకున్నా ఆయన ప్రేమ, బోధనలు, సేవాస్ఫూర్తి నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నడిపిస్తున్నాయి. సత్యసాయి చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి..’అని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం పుట్టపర్తి చేరుకున్న ప్రధాని మోదీ తొలుత భగవాన్ మహా సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం స్థానిక హిల్ వ్యూ స్టేడియంలో శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆధ్యాత్మీకతను మానవ సేవకు పునాదిగా చేసిన మహానుభావుడు సత్యసాయి బాబా అని కొనియాడారు. ‘సాయిరామ్..’అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. పవిత్ర భూమి పుట్టపర్తిలో గడపడం తనకు ఆధ్యాత్మీక, భావోద్వేగ అనుభూతిని కలిగిస్తున్నాయన్నారు. బాబా శతజయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణెం, పోస్టల్ స్టాంపులు విడుదల చేయడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. సేవ, ఆధ్యాత్మీకత వేర్వేరు కాదని.. ‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్..’అని చెప్పిన శ్రీసత్యసాయి మాటలు ప్రేమను సేవగా మార్చే ఆధ్యాత్మీక సందేశమని ప్రధాని మోదీ అభివర్ణించారు. బాబా బోధనలు పుస్తకాలు, ఆశ్రమ గోడలకే పరిమితం కాలేదన్నారు. పట్టణాల నుంచి గిరిజన ప్రాంతాల వరకు విద్య, ఆరోగ్య, సేవా రంగాల్లో ఆయన చేపట్టిన కార్యక్రమాలు కోట్ల మంది గుండెల్లో ఉన్నాయన్నారు. రాయలసీమకు తాగునీరు అందించేందుకు 3,000 కి.మీ మేర పైప్‌లైన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. గుజరాత్ భూకంప సమయంలో సత్యసాయి సేవాదళ్ సేవలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఒడిశాలో వరద బాధితులకు వెయ్యి ఇళ్ల నిర్మాణం సాయి సంస్థల సేవకు నిదర్శనమన్నారు. బిల్లింగ్ కౌంటర్ లేని ఆసుపత్రుల ద్వారా సేవలందించడం సత్యసాయి ట్రస్టుకే సాధ్యమని ప్రశంసించారు. 20 వేల మందికి సుకన్య యోజన ఖాతాలు శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదేళ్ల లోపు బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. దాదాపు 20 వేల మంది బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో వంద గోవులను పేద రైతులకు దానం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని ప్రధాని చెప్పారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, జి.కిషన్‌రెడ్డి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సినీనటి ఐశ్వర్య బచ్చన్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవ స్వరూపం సాయి: సీఎం చంద్రబాబు భగవాన్ శ్రీసత్యసాయి బాబా భూమిపై మనం చూసిన దైవ స్వరూపమని, ప్రజలకు ప్రేమ, సేవ, శాంతి, సౌభాగ్య మార్గాలను చూపించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్.. హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్..’అని చెప్పిన సాయి మాటలు ప్రపంచానికి దిక్సూచిలా మారాయన్నారు. బాబా శతజయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా ప్రకటించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. నాస్తికులను కూడా ఆధ్యాత్మీక మార్గం వైపు నడిపించిన సత్యసాయి సమ్మోహన శక్తి అరుదైనదన్నారు. వందలాది దేశాల నుంచి వచ్చిన భక్తులందరికీ ఆయన దివ్య అనుగ్రహం లభించిందన్నారు. సత్యసాయి సంస్థల ద్వారా అందుతున్న సేవలు ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. జన్మభూమి మాత్రమే కాదు.. కర్మభూమి కూడా – ఆర్జే రత్నాకర్ పుట్టపర్తి.. భగవాన్ సత్యసాయి జన్మభూమి మాత్రమే కాదు, ఆయన కర్మభూమి కూడా అని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ, మానవతా విలువలను ఇక్కడి నుంచే ప్రసారం చేశారన్నారు. సత్యసాయి విద్యాసంస్థల్లో చదివిన వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవ చేస్తుండటం గర్వంగా ఉందన్నారు. భగవాన్ బోధించిన ప్రేమ, సేవ, ధర్మం మార్గాన్ని భవిష్యత్ తరాలకు మరింతగా విస్తరించడం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రధాన ధ్యేయమన్నారు. బాబా తోడుంటే భయం ఉండదు: సచిన్ టెండూల్కర్ సత్యసాయి బాబా తనకు చిన్నతనం నుంచే దైవ సంబంధం లాంటి అనుభూతిని ఇచ్చారని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పారు. తాను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు బాల సత్యసాయిలా ఉన్నావని అందరూ చెప్పేవారన్నారు. తర్వాత బాబాతో ఏర్పడిన అనుబంధం ఆ మాటలకు అర్థం చూపిందన్నారు. 1990లో బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో భగవాన్ సత్యసాయి దర్శనం పొందిన సందర్భాన్ని ఎన్నటికీ మరువలేనన్నారు. మనం అడగకపోయినా మన మనసులో ఏముందో, ఏ సందేహం ఉందో బాబా ముందుగానే చెప్పేవారని తెలిపారు. ఇది నమ్మశక్యం కాకపోయినా.. తాను అనుభవించిన సత్యమన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై బాబా బోధనలు తన జీవితాన్ని ప్రభావితం చేశాయన్నారు. 2011 వరల్డ్ కప్ సమయంలో అపారమైన అంచనాలు, ఒత్తిడి ఉండేవని సచిన్ గుర్తు చేసుకున్నారు. బెంగళూరులో తమ క్యాంపు జరుగుతున్నప్పుడు బాబా ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించానని చెప్పారని, అది తనలో అనూహ్యమైన విశ్వాసాన్ని నింపిందని తెలిపారు. 2011లో ముంబైలో ఇండియా–శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్లో భారత జట్టు గెలిచి ట్రోఫీ అందుకోవడం తన జీవితంలో గోల్డెన్ మూవ్మెంట్ అన్నారు. బాబా మన వెంట ఉంటే భయం అనే మాట ఉండదని, ఆయనను స్మరించడం ఆశీర్వాదం లాంటిదని సచిన్ చెప్పారు. ఆయన సేవ బతికే ఉంది: ఐశ్వర్య బచ్చన్ ‘భగవాన్ సత్యసాయిబాబా దివ్య స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాల్లో సజీవంగా ఉంది. ఆయన ప్రేమ, సేవ, దయకు సరిహద్దుల్లేవు. మానవసేవే మాధవసేవ అని చేసి చూపించారు. బాబా చేసిన ప్రజాసేవ, ప్రేమ, దయ, పరిపూర్ణత ప్రపంచానికి ఆదర్శం’అని ప్రముఖ సినీనటి ఐశ్వర్య బచ్చన్ పేర్కొన్నారు. భగవాన్ బోధించిన క్రమశిక్షణ, అంకితభావం, భక్తి, దృఢ సంకల్పం, వివేకం అనే ఐదు సూత్రాలు మన జీవితానికి దిక్సూచిలా నిలుస్తాయన్నారు. విద్య, వైద్య సేవల్లో సత్యసాయి సంస్ధల సేవలు అమూల్యమని తెలిపారు. బాల వికాస్ స్కూళ్లలో నైతిక బోధనలు భవిష్యత్ తరాలకు వెలుగులు చూపుతున్నాయన్నారు. పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అంతర్జాతీయ స్థాయి వైద్యం పూర్తి ఉచితంగా అందించడం బాబా కరుణామయ హృదయానికి నిదర్శనమన్నారు. జలసేవ, గ్రామీణాభివృద్ధి, యువత సాధికారతలో బాబా చేపట్టిన కార్యక్రమాలు చరిత్రాత్మకమని అన్నారు. 22న పుట్టపర్తికి రాష్ట్రపతి ముర్ము సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు హాజరు సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు హాజరవుతారని రాష్ట్రపతి కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం హైదరాబాద్‌లో ‘భారతీయ కళామహోత్సవ్–2025’ను రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. అనంతరం శనివారం పుట్టపర్తికి వెళ్లనున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం వివరించింది. -
సత్యసాయి నాకు ఫోన్ చేశారు.. ఆయన ఆశీర్వాదం వల్లే ట్రోఫీ: సచిన్
భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) జీవితంలో 2011 మర్చిపోలేని సంవత్సరం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ ఏడాదే ‘మాస్టర్ బ్లాస్టర్’ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాడు. సొంతగడ్డపై.. సొంత మైదానం వాంఖడేలో భారత్ టైటిల్ గెలవడంతో సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సహచరులంతా తనను భుజాలపై ఊరేగిస్తుంటే చెమ్మగిల్లిన కళ్లతోనే అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు.నాటి అందమైన జ్ఞాపకాలను సచిన్ టెండుల్కర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల (Sathya Sai Baba Birth Centenary Celebrations) కోసం ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తికి వచ్చిన సచిన్.. 2011 వరల్డ్‌కప్ సమయంలో ఒత్తిడిని జయించేందుకు వీలుగా బాబా తనలో స్ఫూర్తి నింపిన తీరు వివరించాడు.చివరి వరల్డ్‌కప్ అని తెలుసు‘‘అప్పటికే నేను చాలా వరకు ప్రపంచకప్ టోర్నమెంట్లలో పాల్గొన్నాను. 2011 నాటి టోర్నీ నా కెరీర్లో చివరి వరల్డ్‌కప్ అని తెలుసు. అప్పుడు నేను జట్టుతో కలిసి బెంగళూరు శిబిరంలో ఉన్నాను.బాబా స్వయంగా నాకు ఫోన్ చేశారుఆ సమయంలో నాకో ఫోన్ కాల్ వచ్చింది. బాబా స్వయంగా నాకు ఫోన్ చేశారు. నాకొక పుస్తకం పంపించానని చెప్పారు. అప్పుడు నా ముఖంపై చిరునవ్వు విరిసింది. ఆ ప్రపంచకప్ నా జీవితంలో అత్యంత ముఖ్యమైనదని తెలుసు. జట్టుకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనది.బాబా మాటలు, ఆయన పంపిన పుస్తకం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. అంతర్గత శక్తి పుంజుకుంది. ఆ తర్వాత ఆ పుస్తకం నా జీవితంలో భాగమైపోయింది’’ అని సచిన్ టెండుల్కర్ సత్యసాయి బాబా పట్ల ప్రేమాభిమానాలను చాటుకున్నాడు.అదే విధంగా.. ‘‘2011లో ఏం జరిగిందో అందరూ చూశారు. ముంబైలో శ్రీలంకను ఓడించి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. జాతి మొత్తం ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. నా క్రికెట్ జీవితంలో అదొక గోల్డెన్ మూమెంట్.బాబా ఆశీర్వాదం వల్లే అంతకుముందు నా జీవితంలో మునుపెన్నడూ లేని అనుభూతిని అప్పుడే పొందాను. నా శ్రేయోభిలాషులు, గురువులు... వీరందరితో పాటు బాబా ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని సచిన్ టెండుల్కర్ సత్యసాయి బాబా పట్ల భక్తిని చాటుకున్నాడు. ఎదుటివారిని జడ్జ్ చేయకూడదని.. వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి బాబా చెప్పేవారని సచిన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.కాగా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేశారు. ఇక సచిన్ టెండుల్కర్తో పాటు సినీ నటి ఐశ్వర్యా రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇదిలా ఉంటే.. ధోని కెప్టెన్సీలోని భారత జట్టు 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఫలితంగా సచిన్ ఖాతాలో ఒక్క ప్రపంచకప్ టైటిల్ కూడా లేదనే లోటు ఆ ఏడాది తీరిపోయింది.చదవండి: శుబ్‌మన్ గిల్ వెళ్తాడు.. కానీ: బీసీసీఐ -
పుట్టపర్తి : కనుల పండువగా సత్యసాయి జయంతి వేడుకలు (ఫోటోలు)
-
కనుల పండువగా.. సత్యసాయి రథోత్సవం
భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తులు పుట్టపర్తికి విచ్చేశారు. వేడుకల్లో భాగంగా మంగళవారం సత్యసాయి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రశాంతి నిలయం: సత్యసాయి జయంతి వేడుకల్లో భాగంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మంగళవారం పుట్టపర్తిలో సత్యసాయి రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించింది. ఉదయం ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మూలవిరాట్ సత్యసాయి విగ్రహానికి పూజా క్రతువులు నిర్వహించారు. సాయికుల్వంత్ సభా మందిరంలో వేదపండితులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వేణుగోపాల స్వామి, సీతారామలక్ష్మణ సమేత హనుమ విగ్రహాలకు ప్రత్యేకపూజలు చేశారు. తర్వాత సీతారాముల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. సత్యసాయి సన్నిధిలోనే నిర్వహించిన సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాదిమంది దంపతులు పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ సత్యనారాయణ వ్రత క్రతువులు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం మూలవిరాట్ సత్యసాయి విగ్రహాన్ని, ఉత్సవమూర్తులు వేణుగోపాలస్వామి, రామలక్ష్మణ సమేత హనుమ పల్లకీలను సాయికుల్వంత్ సభా మందిరం ఉత్తరగోపురం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పెద్దవెంకమరాజు కల్యాణ మండపం వద్ద సత్యసాయి రథానికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి భక్తులు ఉత్తర గోపురం వద్దకు రథాన్ని తీసుకువచ్చి సత్యసాయి వెండి రథంలోకి మూలవిరాట్ సత్యసాయి విగ్రహాన్ని ప్రతిష్టించి ఉత్సవాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ బృందం, పలువురు రాష్ట్ర మంత్రులతో కలసి ప్రారంభించారు. అశేష భక్తుల నడుమ పురవీధుల్లో సత్యసాయి రథోత్సవం సాగింది. పెద వెంకమరాజు కల్యాణ మండపం వద్ద రత్నాకర్ రాజు దంపతులు మంగళహారతితో రథోత్సవాన్ని ముగించారు.భిన్నంగా రథోత్సవం.. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆనవాయితీకి భిన్నంగా బాబా శతజయంతి వేడుకల్లో వేణుగోపాలస్వామి రథోత్సవ స్థానంలో సత్యసాయి రథోత్సవం నిర్వహించింది. తమ ఇలవేల్పు సత్యసాయి రథోత్సవాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద తరలివచ్చారు. ‘సాయిరాం’ నామస్మరణతో పరవశించిపోయారు. పుట్టపర్తి పురవీధులన్నీ సాయి నామస్మరణతో ప్రతిధ్వనించాయి. ఉత్సవమూర్తుల పల్లకీలు ముందు ఊరేగగా.. ఆ వెనకే మూలవిరాట్ సత్యసాయి రథం ముందుకు సాగింది. భక్తులు సత్యసాయి రథాన్ని ముందుకు లాగుతూ తరించారు. అడుగడుగునా రథానికి హారతులు పడుతూ కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకున్నారు.మేడలెక్కి.. ‘సాయి’భక్తి.. పుట్టపర్తి పురవీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇసుక వేస్తే రాలనంతగా తరలివచ్చారు. చరిత్రలో తొలిసారిగా పుట్టపర్తిలో సత్యసాయి రథోత్సవం నిర్వహించారు. ఎలాగైనా తన ఇష్టదైవం సత్యసాయి రథోత్సవాన్ని కనులారా తిలకించాలన్న ఆకాంక్షతో భక్తులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవంతులపైకి ఎక్కారు. సత్యసాయిపై భక్తిభావనను చాటుతూ రథంపైకి పూలు విసిరారు.మురిపించిన సాంస్కృతిక ప్రదర్శనలు సత్యసాయి రథోత్సవంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మురిపించాయి. సత్యసాయి బాలవికాస్ చిన్నారులు రథోత్సవంలో రామలక్ష్మణ సమేత హనుమ దేవతామూర్తుల వేషధారణతో నృత్య ప్రరద్శన నిర్వహించారు. పుట్టపర్తి పరిసర గ్రామాల కళాకారులు కోలాటం, చెక్కభజన, హరిదాసుల వేషాలతో అలరించారు. వివిధ ప్రాంతాల కళాకారుల గిరగ నృత్యం, నెమలి నాట్యం, డప్పువాయిద్యాలు, గొరవయ్యల వేషధారణతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.వేడులకు ప్రముఖుల హాజరు సత్యసాయి రథోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొని రథాన్ని లాగారు. వీరిలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, పరిటాల సునీత, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు, చక్రవర్తి, నాగానంద, డాక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
సత్యసాయి సంకల్పం మహోన్నతం
ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప వైభవంగా సత్యసాయి జయంతి వేడుకలు పుట్టపర్తి/కదిరి: కుగ్రామమైన గొల్లపల్లిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిగా తీర్చిదిద్దిన సత్యసాయి సంకల్పం మహోన్నతమైనదని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఆదివారం సత్యసాయి 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ, విదేశాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన భక్తుల నడుమ.. శోభాయమానంగా అలంకరించిన సాయికుల్వంత్ సభా మందిరంలోని బాబా మహాసమాధి చెంత ఉదయం ఎనిమిది గంటలకు విద్యార్థుల వేదమంత్రోచ్ఛారణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో 128 గ్రామాల్లోని 1.5 లక్షల మందికి తాగునీరు అందించేందుకు రూ. 80 కోట్లతో ఏర్పాటు చేసిన పథకాన్ని డిప్యూటీ సీఎం చినరాజప్ప ఇదే వేదికనుంచి ప్రారంభించారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్.జె. రత్నాకర్, చక్రవర్తి, శ్రీనివాసన్ చేతుల మీదుగా తాగునీటి పథకాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ పుట్టపర్తిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని చెప్పారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ రుడాభాయ్ వాలా.. సెంట్రల్ ట్రస్ట్ వార్షిక నివేదికను ఆవి ష్కరించి, భక్తులు తయారు చేసిన 89 కిలోల సత్యసాయి బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. సత్యసాయి నీటి పథకాల రూపకల్పన, నిర్మాణాలలో ప్రముఖపాత్ర వహించిన ప్రభుత్వ మాజీ సలహాదారు కొండలరావును, ఎల్అండ్టీ ఉన్నతోద్యోగులను చినరాజప్ప సన్మానించా రు. వేడుకల్లో మంత్రులు పి. సునీత, పల్లె రఘునాథరెడ్డి, విప్ యూమినీ బాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యేలు పార్థసారధి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వరదాపురం సూరి, మాజీమంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు. ప్రయాణికుల బస్సులో డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తన సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వచ్చి అనంతపురంలో దిగారు. విజయవాడ నుంచి శనివారం రాత్రి బయలుదేరి సాధారణ ప్రయాణికులతో పాటు ఆయన రావడంతో అధికారులు, పార్టీ నాయకులు ఆశ్చర్యపోయారు. -
'సత్యసాయి ఆశయాలను కొనసాగిస్తాం'
అనంతపురం: సత్యసాయిబాబా ఆశయాలను కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. సత్యసాయి జయంతి సందర్భంగా రూ. 80 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం ప్రారంభించారు. మంచినీటి పథకాన్ని చేపట్టిన ట్రస్టును మంత్రి రఘునాథరెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రావాల్సిన రూ. 10 కోట్లను త్వరలో విడుదల చేస్తామన్నారు. సత్యసాయి మంచినీటి పథకాన్ని ప్రారంభిండం అదృష్టంగా భావిస్తున్నానని చినరాజప్ప వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాకు సత్యసాయి పేరు పెట్టాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.


