'సత్యసాయి ఆశయాలను కొనసాగిస్తాం' | sathya sai water scheme launched in anantapur | Sakshi
Sakshi News home page

'సత్యసాయి ఆశయాలను కొనసాగిస్తాం'

Nov 23 2014 2:41 PM | Updated on Oct 17 2018 5:47 PM

'సత్యసాయి ఆశయాలను కొనసాగిస్తాం' - Sakshi

'సత్యసాయి ఆశయాలను కొనసాగిస్తాం'

సత్యసాయిబాబా ఆశయాలను కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

అనంతపురం: సత్యసాయిబాబా ఆశయాలను కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. సత్యసాయి జయంతి సందర్భంగా రూ. 80 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం ప్రారంభించారు. మంచినీటి పథకాన్ని చేపట్టిన ట్రస్టును మంత్రి రఘునాథరెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రావాల్సిన రూ. 10 కోట్లను త్వరలో విడుదల చేస్తామన్నారు.

సత్యసాయి మంచినీటి పథకాన్ని ప్రారంభిండం అదృష్టంగా భావిస్తున్నానని చినరాజప్ప వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాకు సత్యసాయి పేరు పెట్టాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement