Kranti Kumar
-
చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి: దేవినేని అవినాశ్
విజయవాడ: క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతల బృందం పరామర్శించింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును దేవినేని అవినాశ్, రాయన భాగ్యలక్ష్మి, పూనూరు గౌతమ్ రెడ్డి, పోతిన మహేశ్,షేక్ ఆసిఫ్ పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.నెలరోజుల క్రితం ఇదే రోజు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని దేవినేని అవినాశ్ చెప్పారు. ‘‘పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు ప్రభుత్వ హత్యలే. 8 ఏళ్ల క్రితం క్రాంతి కుమార్ పై కేసులున్నాయి. ఇప్పుడు క్రాంతి కుమార్ పై ఎలాంటి కేసులు లేవు. తండ్రి కొనిచ్చిన కారును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తమ దందాల కోసం, గంజాయి అమ్మకాల కోసం పోలీసులు వేధిస్తున్నారు. క్రాంతి కుమార్ మృతికి చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల్లో క్రాంతి కుమార్ కుటుంబం కూటమి కోసం పనిచేశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఇప్పటి వరకూ సీపీ పరామర్శించలేదు. డీజీపీ, సీపీ బయటికి రావాలి. బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. క్రాంతి కుమార్ ను కులం పేరుతో పోలీసులు దూషించారు. డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకూ అందరిపై కేసులు నమోదు చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులే గంజాయి అమ్ముతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు బయటికి వచ్చేవా? జగన్ కలిశాకే సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం కేసు నమోదు చేసింది. సాయికృష్ణ,క్రాంతి కుమార్ కేసులో సీబీఐ విచారణ జరిపించాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది’’ అని తెలిపారు.ఇంకెప్పుడు ఆగుతాయి?మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... క్రాంతి కుమార్ ఆత్మహత్య చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ హత్యలు ఇంకెప్పుడు ఆగుతాయని నిలదీశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ చనిపోయినా చంద్రబాబు, పవన్, హోంమంత్రి నోరుమెదపడం లేదని విమర్శించారు. చంపేసి సెటిల్మెంట్ చేసుకోవాలని చూడటం దుర్మార్గమని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, లేదంటే వైసీపీ తరఫున ఉద్యమం చేస్తామని తెలిపారు.వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడలో పోలీసులంటేనే భయపడేలా చేస్తున్నారని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ చెప్పారు. క్రాంతి కుమార్,సాయికృష్ణవి ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైసీపీ నేత పోతిన మహేశ్ మాట్లాడుతూ.. పోలీసుల వేధింపుల వల్లే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కూటమి అధికారంలోకి రావాలని జనసేన పార్టీ కార్యకర్తలు, క్రాంతి కుమార్ కుటుంబం పనిచేసిందని అన్నారు. కూటమి నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. -
క్రాంతి కుమార్ గల్లంతుపై అనుమానాలు
-
వండర్ బుక్ లో సాహస వీరుడు
హిమాయత్‌నగర్: ఒక కర్ర ముక్క తగిలితేనే ధారగా రక్తం కారుతుండటం మనం చూస్తేనే ఉంటాం. అలాంటిది ఓ యువకుడు పదునైన 5 అంగుళాల మేకును ముక్కులోకి దింపుకొంటే... పైగా దానిపై సుత్తితో కొడితే.. ఆలోచిస్తేనే ఎంత భయంకరంగా ఉంటుంది. అక్కడితో ఆగకుండా గోడలకు రంధ్రాలు చేసే డ్రిల్లింగ్ మిషన్‌తో అదే ముక్కులో డ్రిలింగ్ చేసుకుంటే... ఇంతకీ ఈ సాహసానికి పూనుకున్నది ఎవరనుకుంటున్నారా ఆ యువకుడు నల్గొండ జిల్లా అడ్డగూడూరుకు చెందిన క్రాంతి కుమార్. ప్రపంచంలోనే ఇలాంటి కఠినమైన సాహసాలు చేసేవారిలో ఇతడు మూడో స్థానంలో ఉన్నాడు. తన సాహసాలతో క్రాంతి కుమార్ వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో కూడా చోటు దక్కించుకున్నాడు. శుక్రవారం హిమాయత్‌నగర్ మీడియా సెంటర్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ దక్షిణ భారత సమన్వయ కర్త బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ, ఏపీ సమన్వయ కర్త గుర్రం స్వర్ణశ్రీ తదితరులు, విలేకరుల ముందు ఈ ప్రదర్శన చేసి అందర్నీ అబ్బుర పరిచాడు. క్రాంతి కుమార్ ప్రతిభను గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు మెమొంటో, గోల్డ్ మెడల్‌ను బహూకరించారు. ఈ కార్యక్రమానికి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ డెరైక్టర్ డాక్టర్ కోమట్రెడ్డి గోపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రాంతికుమార్ సాహసాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా బింగి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ అరుదుగా కనిపించే ఇలాంటి సాహసవంతులను ప్రభుత్వం ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి. రమణాచారి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాగా సాహస విన్యాసాన్ని ప్రదర్శించిన యువకుడు క్రాంతికుమార్ రోజు వారీ కూలీగా వాల్ పెయింటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. -
ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగా...
‘‘ ‘ఆ నలుగురు’ చరిత్రలో నిలిచిపోయిన సినిమా. అందులో హీరో రఘురామ్ సమాజం కోసం ఆలోచించే మనిషి. అలాంటి వ్యక్తే వయసు తగ్గి ముఖ్యమంత్రి అయితే సమాజానికి ఎలాంటి సేవ చేస్తాడనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శకుడు అనిల్ జాసన్ గూడూరు తెలిపారు. వెంకట్ కీలకపాత్ర పోషించిన చిత్రం ‘ఆ ఐదుగురు’. క్రాంతి, క్రాంతికుమార్, తనిష్క్ రెడ్డి, కృష్ణతేజ, శశి, అస్మితా సూద్ ఇందులో ముఖ్య తారలు. ప్రేమ్ మూవీస్ పతాకంపై సరితా పట్రా నిర్మించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ప్రేమ్‌కుమార్ పట్రా మాట్లాడుతూ -‘‘ ‘ఆ నలుగురు, వినాయకుడు చిత్రాలతో ప్రజల ప్రశంసలతో పాటు అనేక పురస్కారాలు గెలుచుకున్నాం. మా సంస్థ ఇమేజ్‌ని మరింత నిలబెట్టే విధంగా ఈ ‘ఆ ఐదుగురు’ ఉంటుంది. సామాజిక స్పృహ అడుగడుగునా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మా నటీనటులకు పోలీస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: సుద్దాల అశోక్‌తేజ, కెమెరా: పీజీ విందా, సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్‌కుమార్ పట్రా.


