breaking news
key accused
-
400 కేజీల బంగారం దోపిడీ నిందితుడిని అప్పగించండి: కెనడా విజ్ఞప్తి
కెనడా దేశ చరిత్రలోనే అతిపెద్ద బంగారు దోపిడీగా గుర్తింపు పొందిన కేసులో ప్రధాన నిందితుడైన సిమ్రాన్ ప్రీత్ పనేసర్‌ను తమకు అప్పగించాలని కెనడా అధికారులు అధికారికంగా భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ దోపిడీకి సంబంధించి దాదాపు 20 మిలియన్ డాలర్లకు పైగా విలువైన కార్గో మాయం అయింది.ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి, బ్రాంప్టన్‌కు చెందిన 33 ఏళ్ల సిమ్రాన్ ప్రీత్ పనేసర్ 2023 ఏప్రిల్‌లో టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన భారీ దోపిడీలో కీలక పాత్ర పోషించినట్లు కెనడా పోలీసులు ఆరోపిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి వచ్చిన అధిక విలువైన రవాణాను మళ్లించడంలో అతడు లోపలి వ్యక్తిగా సహకరించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.ఈ రవాణాలో సుమారు 400 కేజీల .9999 స్వచ్ఛమైన బంగారం అంటే దాదాపు 6,600 గోల్డ్ బార్లు (కడ్డీలు), అలాగే 2.5 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దోపిడీ అనంతరం పనేసర్ భారత్‌కు పారిపోయినట్లు కెనడా అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అతనిపై కెనడా వ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడమే కాకుండా, భారతదేశానికి అధికారిక అప్పగింత అభ్యర్థన పంపారు.‘ప్రాజెక్ట్ 24K’ అనే కోడ్ నేమ్‌తో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. 2023 ఏప్రిల్ 17న టొరంటో పియర్సన్ విమానాశ్రయంలోని ఎయిర్ కెనడా కార్గో ఫెసిలిటీలో ఈ దోపిడీ జరిగింది. ఒక నిందితుడు ఐదు టన్నుల డెలివరీ ట్రక్కులో వచ్చి గిడ్డంగి నుంచి రవాణాను తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. రవాణా తాత్కాలికంగా భద్రత కలిగిన హోల్డింగ్ ఏరియాలో ఉంచినప్పటికీ, మరుసటి రోజు అది కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.ఈ దోపిడీ అత్యంత పక్కా ప్రణాళికతో, లోపలి వ్యక్తులు, బయటి సహచరుల సహకారంతో జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పది మందిపై కేసులు నమోదు కాగా, 21 మిందికి పైగా క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే దొంగిలించిన బంగారం ఎక్కువ భాగం ఇంకా స్వాధీనం కాలేదు.పీల్ రీజినల్ పోలీస్ చీఫ్ నిషాన్ దురైయప్ప ఈ అప్పగింత అభ్యర్థన ప్రాధాన్యతను నొక్కి చెబుతూ.. “మీరు ఎక్కడ దాక్కున్నా, మేము మిమ్మల్ని కనుగొంటాం. సరిహద్దులను దాటిన సంక్లిష్ట నేరాలను ఎదుర్కొనే మా సామర్థ్యాన్ని ప్రాజెక్ట్ 24Kతో చూపిస్తాం” అన్నారు.పనేసర్‌పై 5,000 డాలర్లకు పైగా దొంగతనం, నేరానికి కుట్ర వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్ లైన్ ఉద్యోగిగా అతనికి ఉన్న అంతర్గత ప్రాప్యతే ఈ దోపిడీకి కీలకంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. న్యాయ సలహా తీసుకుని స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు అతనిని కోరుతూ, దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.ఇక ఈ అప్పగింత అభ్యర్థన భారత్–కెనడా న్యాయ సహకారాన్ని పరీక్షించనుంది. ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, భారతదేశ దేశీయ చట్టాల ప్రకారం ఈ అభ్యర్థనను భారత అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో కీలక పరిణామంగా, జనవరిలో దుబాయ్ నుంచి కెనడాకు వచ్చిన అనంతరం మరో 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పనేసర్ కోసం గాలింపు చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. -
ఉస్మాన్ హాదీ హత్యపై నిందితుడి సంచలన వీడియో
బంగ్లాదేశ్‌లో తీవ్ర సంక్షోభం సృష్టించిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మసూద్ ఈ అంశంపై కీలక సమాచారం తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. ఉస్మాన్ హాదీ మృతితో తనకు ఏటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ నిందితుడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మసూద్ భారత్‌లో తలదాచుకున్నట్లు బంగ్లా ఆరోపించింది. రాడికల్ విద్యార్థి లీడర్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాదేశ్‌లో ఏ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ మృతితో ఆ దేశంలో విద్వేశజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. హిందువులే టార్గెట్‌గా దాడులు జరిగాయి. ఇవి చాలవన్నట్లు ఇటీవలే అక్కడి మీడియా కథనాలు ఉస్మాన్ హాదీ హంతకులు భారత్‌లో తలదాచుకున్నారని తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మసూద్ దుబాయ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్ని సీఎన్ఎన్ మీడియా సంస్థ ప్రచురించింది.ఫైసల్ కరీం మసూద్ మాట్లాడుతూ" నేను ఉస్మాన్ హాదీని చంపలేదు. బంగ్లాదేశ్‌లో నేను నాకుటుంబం రాజకీయంగా తీవ్రంగా హింసించబడుతున్నాం. ఆ హింస నుంచి తప్పించుకోవడానికి నేను దుబాయ్‌కి వచ్చాను. ఉస్మాన్ హాదీతో నాకుంది కేవలం వ్యాపార సంబంధమే, నా ఐటీ సంస్థ ప్రయోజనం కోసం ఉస్మాన్ని కలిశాను. అతనికి రాజకీయ విరాళాలు కూడా ఇచ్చాను " అని మసూద్ వీడియోలో తెలిపారు.ఈ హత్య ఖచ్చితంగా జమాతే-ఈ- ఇస్లామి సృష్టేనని దీని వెనుక ఆ కార్యకర్తలు ఉండవచ్చని మసూద్ అనుమానం వ్యక్తం చేశారు. తాను భారత్‌లో తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యాలని అన్నారు. జమాతి-ఈ- ఇస్లామి అనిదే బంగ్లాదేశ్‌లోని ఓ రాజకీయ పార్టీ ఇది ఇస్లామిక్ భావజాలలను ప్రోత్సహిస్తోంది.అయితే రెండురోజుల క్రితం ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధమున్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మసూద్, షేక్ ఆలంగీర్ అనే ఇద్దరు నేరస్థులు బంగ్లాదేశ్ జిల్లాలోని మైమాన్సింగ్ జిల్లా సరిహాద్దు గుండా మేఘాలయలో ప్రవేశించారని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్ని అప్పుడే మేఘాలయ పోలీసులు ఖండించారు. -
అనంతపురం ఎబిడ్ సంస్థ చీటింగ్ కేసులో పురోగతి
-
ఈబిడ్ చీటింగ్ కేసులో పురోగతి: కీలక నిందితుడు అరెస్ట్
అనంతపురం క్రైం: ‘ఈబిడ్’ కేసులో కీలక నిందితుడు సునీల్ చౌదరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అతన్ని అనంతపురం కోర్టులో హాజరుపర్చనున్నారు. రూ.లక్షకు రూ.30 వేల వడ్డీ ఇస్తామని ఆశ చూపి ఈబిడ్ సంస్థ నిర్వాహకులు జిల్లాలో రూ.వందల కోట్లు వసూలు చేశారు. వారి చేతిలో 800 మందికిపైగా మోసపోయారు. బాధితులు ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి ఎస్పీ సత్యయేసు బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు. ధర్మవరం మండలానికి చెందిన సునీల్ చౌదరి, మహేంద్ర చౌదరిని కీలక నిందితులుగా గుర్తించారు. వీరితో పాటు మహేంద్ర చౌదరి భార్య జాస్తి మాధవి, బావమరిది సుధాకర్ నాయుడు, అనుచరులు పుల్లానాయుడు తదితరులు ఈ స్కాంలో పాలు పంచుకున్నట్లు తేల్చారు. కాగా.. సునీల్‌చౌదరి ఐదు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. చివరకు సీఐడీ పోలీసులు అతన్ని నాగపూర్‌లో అరెస్టు చేసి కోర్టుకు తీసుకొస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులోని కొందరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం విదితమే. ఇవీ చదవండి: దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. ప్రముఖ న్యూస్ చానల్ విలేకరినంటూ.. -
వైఎస్ షర్మిలపై అసత్య ప్రచారం; సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెట్టిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు సూత్రధారులను పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వైఎస్ షర్మిల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా అనుచిత వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అసలు నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో యూట్యూబ్ చానల్ ‘వాక్డ్ అవుట్ అండ్ మ్యాంగో’ గ్రూప్ ఎండీ వీరపనేని రామకృష్ణను ప్రధాన సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. టీఎఫ్సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్, టాలీవుడ్ నగర్, చాలెంజ్ మంత్ర వెబ్సైట్ల పాత్ర కూడా ఉన్నట్టు వెల్లడైంది. టీఎఫ్సీ మీడియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కార్యాలయం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లో ఉన్న ఎన్బీకే బిల్డింగ్‌లో ఉంది. ఎన్బీకే భవనం నందమూరి బాలకృష్ణకు చెందినది. వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వెనుక టీడీపీ నాయకుల హస్తమున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. కొంతమంది పరారీలో ఉన్నారు. రెండు మూడు రోజుల్లో సూత్రధారులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని సమాచారం. -
వైఎస్ షర్మిల ప్రతిష్టను దెబ్బతీసేందుకే..
-
క్రికెట్ బుకీ హత్య కేసులో కీలక నిందితుడి అరెస్టు
అమలాపురం(తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణానికి చెందిన ఆక్వా రైతు, క్రికెట్ బుకీ కుచ్చర్లపాటి వెంకట సత్యనారాయణరాజు(సత్తిబాబు రాజు) కిడ్నాప్, హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు సాగిరాజు అప్పల త్రినాథవర్మ(రఘు) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఇతడు మూడేళ్లుగా పరారీలో ఉన్నాడు. వివరాలివీ...అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన సత్యనారాయణ రాజు 2012 ఆగస్టు 23వ తేదీన కిడ్నాపై కొద్దిరోజుల తర్వాత నల్లమల అడవుల్లో హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కీలక నిందితుడైన ఐ.పోలవరానికి చెందిన అప్పల త్రినాథవర్మ మాత్రం పరారీలో ఉన్నాడు. క్రికెట్ బుకీగా వ్యవహరించిన త్రినాథవర్మకు అప్పట్లో హైదరాబాద్‌లో ఉండే సత్యనారాయణరాజుతో సత్సంబంధాలు ఉండేవి. అయితే, క్రికెట్ బుకీగా తీవ్రంగా నష్టపోయిన సత్యనారాయణ రాజుతో త్రినాథవర్మకు విభేదాలు తలెత్తాయి. అనంతరం సత్యనారాయణ రాజు తన మకాంను హైదరాబాద్ నుంచి అమలాపురానికి మార్చి, ఆక్వా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే త్రినాథవర్మ మాత్రం ఆయనతో విభేదాలను మనసులో ఉంచుకుని తన మనుషుల సాయంతో అతడిని కిడ్నాప్ చేశాడు. కారులో తొలుత నల్లగొండ జిల్లా సూర్యాపేటకు, అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆమ్రాబాద్ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతానికి తరలించారు. ఈక్రమంలోనే అతని ఏటీఎం కార్డు నుంచి రూ.5 లక్షలకు పైగా డ్రా చేశారు. కారులోనే సత్యనారాయణరాజుకు మత్తుమందు ఇచ్చి, గొంతు నులిమి చంపేశారు. అనంతరం నల్లమలలో మృతదేహాన్ని దహనం చేశారు. ఈ సంఘటనతో సంబంధమున్న ఐదుగురిని అరెస్టు చేసిన అమలాపురం పోలీసులు...త్రినాథవర్మ కోసం గాలిస్తున్నారు. అయితే, ఇటీవల ఒక కేసు విషయమై ఇటీవల హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అమలాపురం పోలీసులు పీటీ వారెంట్‌ను సమర్పించి వర్మను సోమవారం తమ కస్టడీలోకి తీసుకుని, అతని నుంచి రూ.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సత్యనారాయణరాజు కిడ్నాప్, హత్య కేసు చిక్కుముడి వీడినట్లయింది.


