వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్ట్‌లు పెట్టిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు సూత్రధారులను పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. వైఎస్ షర్మిల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా అనుచిత వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అసలు నిందితులను పోలీసులు గుర్తించారు.